📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్డ్రైనేజ్ మరమ్మతు పనులు ఇస్తానుసారంగా చేస్తున్నారు..

డ్రైనేజ్ మరమ్మతు పనులు ఇస్తానుసారంగా చేస్తున్నారు..

📰 Generate e-Paper Clip

బద్వేల్ పట్టణంలో ఒక నెల ఒక నియోజకవర్గం లో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆర్.ప్రవీణ్ కుమార్.

వైయస్సార్ కడప జిల్లా.(ప్రజావాణి జూన్ 30)  పోరుమామిళ్ళ మండలం లోని రంగసముద్రం పంచాయితీ లోని సుందరయ్య కాలనీ లో జరుగుతున్న డ్రైనేజీ పనులలో సంబంధించిన కాంట్రాక్టర్. మరియు అధికారులు కుమ్మక్కై వారి ఇష్టానుసారంగా దాదాపు 6 అడుగుల లోతు తో డ్రైనేజీ కాలువ పనులు చేస్తున్నారని. దానివల్ల నా ఇల్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని బాధితుడు ఆర్. ప్రవీణ్ కుమార్ బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రాఘవేంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఒక నెల ఒక నియోజకవర్గం కార్యక్రమం లో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి. తెలుగుదేశం పార్టీ నాయకులు కడప డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి. కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా. బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు ఆర్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ నందు సుందరయ్య కాలనీలో సర్వే నంబర్ 1262 లో విస్తీర్ణం 3 సెంట్ల స్థలం ను నా తండ్రి రత్నమయ్య పేరుతో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారని. ఆ స్థలంలో మేము ఇల్లు నిర్మించుకొని ఉన్నామన్నారు.2029 వ సంవత్సరంలో సుందరయ్య కాలనీ లో ప్రభుత్వం సిమెంటు రోడ్డు మంజూరు చేయించి.రోడ్డుకు డ్రైనేజ్ కలవలు వేశారన్నారు. ఈ కాలం నుండి వర్షపు నీరు డ్రైనేజీ నీరు కాలువల గుండా పోతుండేవని ఆయన అన్నారు.రోడ్డుకు వేసిన డ్రైనేజ్ కాలువను కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు.ఇటీవల కాంట్రాక్టర్ మరియు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు. ఎంపీడీవో. లు డ్రైనేజ్ ఆక్రమణలపై పట్టించుకోవడం లేదన్నారు.నా ఇంటి బేస్ మట్టం ను ఆనుకొని సుమారు ఐదు అడుగుల మేర కాలువలు తొవ్వుతున్నారు.ఇలా చేయడము వలన నా ఇల్లు కాలువలో పడిపోతుందని. అందువల్ల నాకు ఆస్థి నష్టము జరుగుతుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్థుతము ఎంపీపీ కాలపరిమితి ముగుస్తున్నందున వారి స్వలాభము కొరకు ఈ పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలో ఉన్న పాత కాలువల పై చర్యలు తీసుకొని పాతకాలవలకు పూడిక తీసి పాత మా ఇంటి కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.