📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి -- సీఐ విద్యాసాగర్

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలి — సీఐ విద్యాసాగర్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,జూన్ 22 (ప్రజావాణి)

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Say No To Drugs – Say Yes To Life” కార్యక్రమంలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి అనుభంద గ్రామమైన ఎల్లంపల్లి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిద్ధిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చి. విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై వాటి ప్రభావం గురించి వివరించి అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండి విద్య, క్రీడలు, మంచి అలవాట్లతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.సందర్భంగా “డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం”, “I Am An Anti-Drug Soldier” అనే సందేశాలతో ప్రతి విద్యార్థి, పౌరుడు మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 8712671111 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉందని, యువత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, అంజయ్య, సైబర్ వారియర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.