📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyవిద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

📰 Generate e-Paper Clip

•విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

*ఎల్‌ఐజీ కాలనీ పాఠశాలలో సేల్స్‌ఫోర్స్ ఉద్యోగుల సేవా కార్యక్రమం
పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి*



భారతీనగర్, జూన్ 19 (ప్రజావాణి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఉద్యోగుల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్  సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత ఎంతో కీలకమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో సహకరించాలని సేల్స్‌ఫోర్స్ ప్రతినిధులను కోరారు. దీనికి స్పందించిన కంపెనీ ప్రతినిధులు పాఠశాలలో అవసరమైన అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేల్స్‌ఫోర్స్ సంస్థ ఉద్యోగులను ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే జీవితంలో విజయాలు సాధించగలరని సూచించారు.
ఈ కార్యక్రమంలో సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఉద్యోగులు కార్ల్ లార్సినా, అర్జున్ సాహా, పాండురంగారావు రాళ్లపల్లి, ఎల్‌ఐజీ కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, డైరెక్టర్ శామ్యూల్ జాన్, సత్యవతి, సరిత తదితరులు పాల్గొన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు కార్యక్రమాన్ని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.