📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ళు తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం.

విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ళు తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం.

📰 Generate e-Paper Clip

కృష్ణాజిల్లా,జూన్ 7 ప్రజావాణి విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ళు తొలగింపుకు ప్రభుత్వం సిద్ధం. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో వంద కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం.ఫ్లైఓవర్ నిర్మాణం వద్దంటూ నిరసన దీక్షకు దిగిన బాధిత కుటుంబాలు.మద్దతు తెలిపిన వైసీపీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, సిపిఎం నాయకులు.బాధితులు మాట్లాడుతూ:మూడు తరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం.గత కొన్ని నెలలుగా రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు.ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారంలో ఇళ్ళు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ళు ఎలా కాళీ చేయాలి.ఉన్న పణంగా ఇళ్ళు ఖాళీ చేయమంటే 100 కుటుంబాలు ఎక్కడకు వెళ్లాలి.ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు.న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలే పరిస్థితి లేదు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గడిచిన దశాబ్దాల కాలంగా నివాసం ఏర్పాటు చేసుకుని చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి అత్యధిక శాతం దళిత బహుజనలు వారి పక్షాన గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గారు ఈ విషయాలపై అక్రమ తొలగింపు పై ముందస్తుగానే వినతి పత్రం గౌరవ కలెక్టర్ గారికి సమర్పించారు అయినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా వారికి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయకుండా అర్ధాంతరంగా వారిని వారి ఇళ్ళను కూల్చివేసే ప్రయత్నం చాలా దారుణమని కిరణ్ రాజు ప్రకటనలో అసహనం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని పేదల బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకునే విధంగా ఉండకూడదు అని వారికి శాశ్వత స్థిర నివాసం పక్కా ఇల్లు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గం మద్దతుగా నిలుస్తుంది అని అవసరమైతే వల్లభనేని వంశీ గారి ఆదేశాల మేరకు సమస్యను పై స్థాయిలో తీసుకువెళ్లి ఉద్యమాన్ని తీమరతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఇదే సమయంలో వారికి సంఘీభావంగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు గారికి సిపిఎం పార్టీ వారికి స్థానిక నాయకులకు ధన్యవాదాలు కిరణ్ గారు తెలియజేశారు త్వరలోనే వంశీ మోహన్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారని ఆయన తెలియజేశారు బాధితులు పక్షాన న్యాయం జరిగే వరకూ వారు అండగా ఉంటారని, తెలియజేశారుబాధితులకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ళు తొలగింపుకు ఏర్పాటు చేయడం దుర్మార్గం.ఫ్లై ఓవర్ కు అడ్డులేని ఇళ్ళను కూడా తొలగించాలని చూస్తున్నారు.ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేర తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాధితుల తరపున ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.తొలగించే పరిస్థితి వస్తే గ్రామంలోనే మూడు సెంట్ల స్థలంలో ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలి. బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తే బాధితులకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.