📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఈటెల పై దుష్ప్రచారం దుర్మార్గందుష్ప్రచారాన్ని, అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఈటెల పై దుష్ప్రచారం దుర్మార్గం
దుష్ప్రచారాన్ని, అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

*ఈటెల పై దుష్ప్రచారం దుర్మార్గం*
*దుష్ప్రచారాన్ని, అభ్యంతకర పోస్టర్ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం*
*తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య*
*జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య*

*మన ప్రజావాణి**మందమర్రి*
జూన్ 2
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారం దుర్మార్గమని, ఈ దుష్ప్రచారాన్ని, ఈటలపై వెలిసిన అభ్యంతర పోస్టర్ల వ్యవహారాన్ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య లు తెలిపారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈటెల రాజేందర్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఈటెల రాజేందర్ ప్రతిష్టను దెబ్బతీయాలను ఉద్దేశ్యంతోనే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారాల తెరలేపడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అభ్యంతరమైన పోస్టర్లు అతికించిన వారిని నిఘా నేత్రాల ఆధారంగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. ఈటెలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఇటువంటి కుట్రలను ఐక్యంగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈటెల రాజేందర్ ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఇలాంటి దుష్ప్రచారులు ఆయన ప్రజాదరణ ను ఏమాత్రం తగ్గించలేని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు చొప్పరి సోమయ్య, ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం స్టేట్ కన్వీనర్ సానబోయిన రాజ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్, పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.