📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జులై 1న వి బి జి గ్రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు జయప్రదం...

జులై 1న వి బి జి గ్రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి. వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు

📰 Generate e-Paper Clip

కడప జిల్లా జూన్ 25ప్రజావాణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జులై ఒకటో తేదీ నుంచి వి బి జి గ్రామ్ జి చట్టాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ మండల అభివృద్ధి కార్యాలయాల వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ తెలిపారు.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్న పాత పద్ధతి లోనే మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించాలని ఏడాదికి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని మేధావులు చెబుతున్న మాటలును నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెవికెక్కకపోవడం విచారకం అన్నారు.నూతనంగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజుగార్ అండ్ అజ్విక్ మిషన్ గ్రామీణ్.(వి బి జి గ్రామ్ జి చట్టాన్ని) పేరుకు మాత్రం 125 రోజులు పని దినాలు పొందుపరిచారు రైతులకు క్రాప్ హాలిడే పేరుతో 65 రోజులు పని దినాలు కోత విధిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం 60% శాతం నిధులు జమ చేయటం జరుగుతుందన్నారు.ఇప్పటికే కూలీలకు మాస్టర్ కాకుండా ఈ కేవైసీ ఫేష్ యప్ ద్వారా హాజరు అమలు చేస్తున్నారు. దీనివల్ల కూలీలు పని చేసే చోట నెట్వర్క్ లేక అనేక అవస్థలు పడుతూ ఉరితాడు లాగా మానసికంగా బాధపడుతున్నారు.పాత పద్ధతిలోనే మాస్టారు అమలు చేయాలనిచేయాలని కూలీలందరూ పెద్ద ఎత్తున పనుల వద్ద నిరసన తెలియజేస్తున్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది అన్నారు.వెంటనే ఫేష్ యప్ రద్దు చేయాలని పాత పద్ధతిలోనే మాస్టారు అమలు చేయాలని,సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని, ఏడాదికి 200 రోజులు పనులు కల్పించాలని నేటి ధరలకు అనుగుణంగా 700 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.క్షేత్రస్థాయి సిబ్బంది పై రాజకీయ వేధింపులు మీరు పోయాయి గత ఫీల్డ్ అసిస్టెంట్లను అందరిని తొలగించి కూటమి పార్టీల కార్యకర్తలను సానుభూతిపరులు అందర్నీ నియమించుకున్నారన్నారు.ఈ నూతన వి బి జి గ్రామ్ జి చట్టం వల్ల క్షేత్రస్థాయి ఉపాధి హామీ ఉద్యోగులకు కూడా ముప్పు ఏర్పడిందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పి మధు రఘు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.