📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జి రామ్ జీ నూతన చట్టం ద్వారా వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం,జాతీయ గ్రామీణ ఉపాధి,భారత్...

జి రామ్ జీ నూతన చట్టం ద్వారా వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం,జాతీయ గ్రామీణ ఉపాధి,భారత్ కేత్ మద్దూర్ యూనియన్ హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా జూన్ 23ప్రజావాణి బేతంచెర్ల,కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్త చట్టం విబి జి రామ్ జి తెచ్చి పేదల నోట్లో మట్టి కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనపడుతున్నది. ఉపాది హామీ నిధుల్లో ఏపీకి భారీగా 40 వేల కోట్ల కోత పడుతున్నట్లు అర్థమవుతున్నదని రాష్ట్ర ప్రయోజనాలపై రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మాట అయినా కూడా మాట్లాడని పరిస్థితి నెలకొన్నదని నూతన చట్టాన్ని రద్దుచేసి యధావిధిగా పాత చట్టాన్ని కొనసాగించాలని బి.కే.ఎం.యు జాతీయ సమితి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బేతంచెర్ల మండల సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ నాగమణి గారికి డిమాండ్స్ కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బి.కె.ఎo.యు మండల కార్యదర్శి దస్తగిరి మండల నాయకులు సోమన్న, నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బి.కె.ఎం.యు మండల కార్యదర్శి దస్తగిరి మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలో అమలు చేయాలని ప్రవేశపెట్టనున్న జి రాంజీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా మన కరువు ప్రాంతాలు, మెట్ట ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ఉపాధి హామీ ఒక కీలకమైన జీవనాధారమని
2014-2015 నుంచి 2025 -2026 వరకు ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి సుమారు 77,400 కోట్లు వచ్చాయని అదే కాలంలో దేశవ్యాప్తంగా ఉపాధి హామీపై జరిగిన వ్యయంలో దాదాపు 8.8%, కానీ కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న విబి జి రామ్ విధానం ప్రకారం నిధుల కేటాయింపు జరిగితే, ఆంధ్రప్రదేశ్ వాటా 8.8% నుంచి కేవలం 4.22 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. అంటే అదే స్థాయి జాతీయ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి రావలసిన నిధులు సుమారు 77,400 కోట్ల నుంచి 37 వేల కోట్లకు తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 40,000 కోట్ల నష్టం కలిగే అవకాశం ఉంది. అది చిన్న సాంకేతిక మార్పు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాల్లో 688 మండలాల్లో 13,326 గ్రామపంచాయతీల్లో ఉన్న 26 వేల గ్రామాల్లోని ప్రజలు 66.45 లక్షల మంది జాబ్ కార్డులు జారీ చేయగా అందులో యాక్టివ్ గా ఉన్న జాబ్ కార్డులు 55 లక్షలు మాత్రమే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో దళితులు, గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పేద కుటుంబాలు వలసలు పెరిగే ప్రమాదం వుంది. గ్రామీణ ప్రాంతాలపై నేరుగా పెద్ద ఆర్థిక ప్రభావం చాలా తీవ్రంగా పడే అవకాశం ఉందని ఆవేదనతో అన్నారు. ఉపాధి హామీ పథకం సాధారణ సంక్షేమ పధకం కాదు. అది పేదల చట్టబద్దమైన హక్కు. ఆంధ్రప్రదేశ్ కు రావలసిన వాటా తగ్గిపోతే దాని ప్రభావం నేరుగా గ్రామీణ కూలీల మీద,ముఖ్యంగా అట్టడుగు వర్గాలు దళితులు,గిరిజనులు,ఆర్థికంగా వెనకబడిన వర్గాలపై పడుతుందని ఇంత పెద్ద నష్టం రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఎదురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం చాలా బాధాకరమని . రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై పనుబారం పడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ని బిజి రామ్ చట్టాన్ని వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేయవలసి ఉండగా,ఇటీవల మంత్రి మండలి సమావేశంలో కొత్త చట్టాన్ని ఆమోదించడం వ్యవసాయ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి తెలియజేస్తున్నదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం పై రాబోయే సంవత్సర కాలంలో ఆర్ధిక పెనుభారంగా మారి ఉపాధి హామీకి నిధులు కేటాయించే పరిస్థితి ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తన వాటా 40 శాతం డబ్బులు కేటాయిస్తేనే,కేంద్ర ప్రభుత్వం 60% విదులు కేటాయిస్తుందని దీనివలన మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా కొత్త చట్టం వలన రాష్ట్రానికి జరిగే ఆర్ధిక వేసులుబారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం BKMU మండల సమితి డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిరుమష్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్,బి.కె.ఎం.యు నాయకులు ప్రదీప్, మధు,గౌరీ ఉదయ్,శివ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.