📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల బద్వేలు మెయిన్ రోడ్డు ఇరువైపులా వున్న భూ అక్రమనలను దొంగ ఆన్లైన్లను విచారణ చేపట్టాలి

పోరుమామిళ్ల బద్వేలు మెయిన్ రోడ్డు ఇరువైపులా వున్న భూ అక్రమనలను దొంగ ఆన్లైన్లను విచారణ చేపట్టాలి

📰 Generate e-Paper Clip

బి కోడూరు జూన్ 23ప్రజావాణి మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని 200 ఎకరాల అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిన బి కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం.అధికారులు మారుతున్న కొద్దీ మండలంలో పెరుగుతున్న భూ ఆక్రమణలు గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన భూకబ్జాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి- సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్.మండలంలో వందల ఎకరాల భూములు ఆక్రమణ గురయ్యాయని తక్షణమే గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో బద్వేలు పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూముల అక్రమ ఆన్లైన్ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి కబ్జాదారుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.మంగళవారం సాయంత్రం బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి (RDO )కి తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య,బి,అనిల్ మరియు వారి పార్టీ బృంద సభ్యులతో కలిసి RDOకి ఆధారాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ,బి కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారిందని, బద్వేల్ పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ దగ్గర నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీ హోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది బినామీ పేర్లతో ఆన్లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని, దీని విలువ 100 కోట్లకు పైగా చేస్తుంది అని వారు అన్నారు అదేవిదంగా కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని వారు ఆరోపించారు. ఇందులో ప్రధానంగా కామకుంట గ్రామ పొలం సర్వేనెంబర్ 160, 170,171,202 లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డి తనకు 25 ఎకరాలు రిజిస్టర్ భూమి ఉండగా మరో 15 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని,218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య,95, 96 లో గోపవరం చెందిన గంగిరెడ్డి, 12,13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు 17లో యోగానంద రెడ్డి మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వేనెంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమ్ ఆన్లైన్లో చేపించుకొని కొంతమంది అమ్ముకొని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్న మాట వాస్తవం కాదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాల పైబడి ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమణ చేసి పట్టపగలే చదును చేస్తుంటే రెవిన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా? లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆక్రమాల పరంపరంతా గతంలో ఇన్చార్జి తహసీల్దారుగా పనిచేసిన కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిందని తక్షణమే ఈ ఆక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి,దప్పిలమ్మ దగ్గర నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీసర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేస్తూ కబ్జాదారులపై,వారికి సహకరించిన రెవిన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిజమైన అర్హులైన పేదలకు ఆ భూములు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు.ఆధారాలతో కూడిన అక్రమాదారుల పేర్లు సర్వే నెంబర్ లు ( 15 డిమాండ్ లతో కూడిన వినతి పత్రానికి స్పందించి RDO కార్యాలయంలో వున్న బి, కోడూరు,తహసీల్దార్ రమణమ్మ ని పిలిపించి సోమవారం లోపు.సర్వే నెంబర్ ల వారీగా సర్వే చేసి తనకు రిపోర్టు సబ్మిడ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైనా ఆక్రమిత భూములల్లో జేసీబీ లు ట్రాక్టర్ లు టిప్పర్లు ఉంటే వాటిని సీజ్ చెయ్యాలని ఆదేశాలిచ్చారు;ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య,అనిల్ ఏరియా కమిటీ సభ్యులు M,విజయరావు జయపాల్,గంట,మహబూబ్ బాషా, చంద్రపాల్ నాయకులు ఈశ్వర్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.