📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyజిల్లేడు-చౌదరిగూడెం మండలంలో జాతీయ జెండాకు ఘోర అవమానం

జిల్లేడు-చౌదరిగూడెం మండలంలో జాతీయ జెండాకు ఘోర అవమానం

📰 Generate e-Paper Clip

*జిల్లేడు-చౌదరిగూడెం మండలంలో జాతీయ జెండాకు ఘోర అవమానం_**

*గ్రామ పంచాయతీ కార్యాలయంపై తలకిందులుగా జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్…*

*మండల స్థాయి అధికారుల సాక్షిగా తలకిందులుగా రెపరెప  లాడిన మువ్వన్నెల జెండా..*

*జనగణమన పూర్తయ్యేదాకా సెల్యూట్ చేస్తూ నిర్లక్ష్యం!*

షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02:


రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండలం లోని  గ్రామ పంచాయతీ కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అత్యంత ఘోరమైన, సిగ్గుచేటైన సంఘటన చోటుచేసుకుంది. దేశ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అయిన జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి తీవ్రంగా అవమానించారు.  రంగారెడ్డి జిల్లా చౌదరిగుడా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది….

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌదరి గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా: గ్రామ సర్పంచ్ జాతీయ జెండాను  తలకిందులుగా (ఆకుపచ్చ రంగు పైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా) తాడుకు కట్టారు.
కనీసం చూసుకోకుండా ఆ జెండాను అలాగే పైకి ఎగురవేసి, ఆవిష్కరించారు.
జెండా పైకెగిరి రెపరెపలాడుతున్నా.. అది తలకిందులుగా ఉందనే కనీస జ్ఞానం అక్కడ ఉన్న ఎవరికీ లేకపోవడం గమనార్హం.
మండల అధికారుల సాక్షిగా ఈ సంఘటన జరిగింది ‘
ఈ వేడుకల్లో కేవలం సర్పంచ్, స్థానిక రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. మండల స్థాయికి చెందిన అన్ని శాఖల ఉన్నతాధికారులు సగర్వంగా హాజరయ్యారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవుల్లో ఉండి, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ అధికారులు సైతం జెండా తలకిందులుగా ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయారు.
అంతకంటే దారుణం ఏంటంటే… జెండా తలకిందులుగా ఎగురుతున్నా, ‘జనగణమన’ జాతీయ గీతం పూర్తయ్యేంత వరకు అధికారులందరూ ఏమాత్రం చలించకుండా అలాగే నిలబడి సెల్యూట్ చేస్తూ ఉండిపోయారు. దేశభక్తి అంటే కేవలం ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ కొట్టడమేనా.. కళ్లెదుట జాతీయ జెండాకు అవమానం జరుగుతుంటే చూసే కనీస బాధ్యత లేదా అని ప్రజలు మండిపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.