ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత: వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఎంఎంసీ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌లో గల ఘనపురం, లింగాపూర్, ఇందిరానగర్, పకీర్ టేక్య తండా ప్రాంతాల్లోని 332, 333 బూత్‌ల వద్ద కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మహేష్...