📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణAdilabadస్వయం ఉపాధి ద్వారా ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

స్వయం ఉపాధి ద్వారా ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

📰 Generate e-Paper Clip

*స్వయం ఉపాధి ద్వారా ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధే లక్ష్యం*

*నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ లో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ జాయింట్ ఐడెంటిఫికేషన్ ఇంటర్వ్యూల నిర్వహణ*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

నల్లగొండ నగరంలోని షెడ్యూల్డ్ కులాల కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం లక్ష్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా నేడు (20.05.2026) నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జాయింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల ప్రాముఖ్యతను వివరించారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేసి బ్యాంకు రుణం మరియు కార్పొరేషన్ సబ్సిడీతో జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్‌లకు గాను మొత్తం 47 యూనిట్లు మంజూరు చేయబడినట్లు తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి మొత్తం 442 మంది అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. విభిన్న పథకాల కింద వచ్చిన దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. EV Two Wheelers – 23 యూనిట్లు, 243 దరఖాస్తులు, EV Three Wheelers – 10 యూనిట్లు, 177 దరఖాస్తులు, Animal Husbandry (Milch Animals) – 12 యూనిట్లు, 17 దరఖాస్తులు, Solar Universal Pumps – 2 యూనిట్లు, 5 దరఖాస్తులు, అభ్యర్థుల అర్హతలు, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకొని జాయింట్ ఐడెంటిఫికేషన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఆధారిత స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసి, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని కమిషనర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శక విధానంలో ఎంపిక చేపట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ బి. శరత్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారులు, టి.ఎం.సి శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సంబంధిత అధికారులు మరియు దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.