📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaరైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

*రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట అమ్ముకునేందుకు నల్గొండ జిల్లాలో రైతులకు కష్టాలు తప్పట్లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు సాగక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట అకాల వర్షాలకు తడిస్తే తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం రైతులను అరగోసలు పెడుతుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని గొప్పలు చెప్తుంది కానీ ఎక్కడ చూసిన ధాన్యం ఐకెపి సెంటర్లోనే కనిపిస్తుదని రాష్ట్ర మంత్రులు ప్రతి గింజా కొనుగోలు చేస్తామని మంత్రులు పత్రికా ముఖంగా చెప్పడం వరకు మాత్రమే జరుగుతున్నదని క్షేత్రస్థాయిలో అది విఫలమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ఏ విదంగా పట్టించుకుంటున్నదో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని చూస్తే అర్ధం అవుతుందన్నారు. పండించిన పంట కొనుగోలు చేసే నాధుడు లేక ధాన్యం కుప్పల మీదనే రైతన్న ప్రాణాలు విడుస్తున్న ఈ సర్కారుకు పట్టింపు లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులను నిద్ర మత్తు మేల్కొల్పి కొనుగోలు కేంద్రాల్లో సరిపడ లారీలను ఏర్పాటు చేసి కొనుగోల్లు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.