📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ గా అరుణ్ రిచర్డ్ బాధ్యతల స్వీకరణ

సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ గా అరుణ్ రిచర్డ్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

గుంటూరు మే 19 ప్రజావాణి కమిషనరేట్ నూతన కమిషనర్ గా అరుణ్ రిచర్డ్ గుంటూరు కన్నావారితోటలోని జి.ఎస్.టి ప్రధాన కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జి.ఎస్.టి, కస్టమ్స్ జోన్ లోని ఐదు కమిషనరేట్లకు అప్పీలెట్ అధారిటి గా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్ గా పనిచేస్తూ, గుంటూరు జి.ఎస్.టి కి బదిలీ పై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు. సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ పరిధిలోకి రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల్లోని ఐదు జి.ఎస్.టి డివిజన్ కార్యాలయాలకు, 36 జి.ఎస్.టి రేంజ్ ఆఫీసు కార్యాలయాలకు కమిషనర్ ప్రాతినిధ్యం వహిస్తారు. కమిషనర్ నేతృత్వంలో అదనపు కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, డిప్యూటీ మరియు అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తారు. అరుణ్ రిచర్డ్ నూతనంగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా శాఖాపరంగా వివిధ హోదాలలోని అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి, పుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. తొలుత కమిషనర్ కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్ కుమార్, పి.ఆర్.ఓ ఆర్.పి.పి కుమార్ ఘనమైన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.