గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) మంగళగిరి సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం కమిషనర్ అలీం బాషా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ సీతానగరం ఘాట్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించే ఈ పవిత్ర ప్రాంతాన్ని పరిశుభ్రంగా,ఆహ్లాదకరంగా మరియు అందంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు.సీతానగరం ఘాట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ చెత్త పేరుకుపోకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడం నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు,చెత్త వేయవద్దు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి స్వచ్ఛతే సేవ వంటి సందేశాలతో లిటరింగ్ నిషేధ బోర్డులు ఏర్పాటు చేసినట్లు షా తెలిపారు.ఈ చర్యలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల బాధ్యతాభావాన్ని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అదేవిధంగా ఘాట్ ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు మరియు సందర్శకులు తప్పనిసరిగా చెత్తను చెత్త బుట్టల్లోనే వేయాలని,నదీ తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు.పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కమిషనర్ పేర్కొన్నారు.ఇంటి పరిసరాలు కాలనీలు,రహదారులు మరియు ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మాత్రమే స్వచ్ఛ మంగళగిరి లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు చెత్తను రోడ్లపై,కాలువలలో లేదా నదీ తీర ప్రాంతాల్లో వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
సీతానగరం ఘాట్‌కు నూతన సౌందర్యం పరిశుభ్రతకు ప్రాధాన్యం,ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక చర్యలు
RELATED ARTICLES

