*విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట*
*ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన*
*రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి*
* *మన ప్రజావాణి*, *మందమర్రి*:- మే 27
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మండలంలోని అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన మండలంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు. ఈసందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విద్యార్థులే దేశ ప్రగతికి మూలస్తంభాలని, విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చున్నారు. సిరిసంపదలు ఎన్నున్నా చదువు లేకపోతే అవన్నీ సున్నా అని, విద్య తోనే విజ్ఞానం, విషయ పరిజ్ఞానం పెరుగుతాయని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్నారు. ఈసంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే ఎక్కువగా టాపర్స్ గా నిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు స్థాపించడం జరుగుతుందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాల అభివృద్ధికి స్పెషల్ ఫండ్స్ కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తో మహిళల కోసం చాలా టాయిలెట్లు కట్టించడం జరిగిందన్నారు. విద్య కోసం ఎన్ని నిధులైన కేటాయిస్తామని తెలిపారు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తో టీచర్ల భర్తీ, బెంచీలు బోర్వెల్స్ ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ ఆలోచన ప్రకారం విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, అది స్వేచ్ఛను, ఆలోచన శక్తిని ఇస్తుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కోటపల్లి మండలం సోమనపల్లి వద్ద 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొనసాగుతోందని, మందమర్రిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని, చెన్నూరులో సైతం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు.ఉపాధ్యాయుల కృషి వల్లే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మూలస్తంభాలని కొనియాడారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు పాఠశాలలకు బెంచీలు, ఆర్వో ప్లాంట్లు అందజేసినట్లు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వేతనాలు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 95.15 శాతం ఫలితాలు రావడం గర్వకారణమని, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 97.20 శాతం ఫలితాలు రావడం అభినందనీయమన్నారు. మందమర్రి మండలం 97.88 శాతం ఫలితాలతో ముందంజలో నిలవడం గొప్ప విషయమన్నారు. 2026-27 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు మరింత పట్టుదలతో పనిచేసి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, విద్యాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. విద్యతోనే తాను ఈ స్థాయికి ఎదిగాన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి యాదయ్య,మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, మండల విద్యాధికారి రమేష్ రాథోడ్, డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
RELATED ARTICLES

