📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మహిళల హక్కులు – చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన.జిల్లా ఎస్పీ

మహిళల హక్కులు – చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన.జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా (న్యూస్ మే 26 ప్రజావాణి) పోలీస్ శాఖ- పిల్లలతో ముఖాముఖి నిర్వహించి సందేహాలకు సమాధానాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ-శక్తి టీమ్స్,టోల్ ఫ్రీ నంబర్లు,భద్రతా యాప్‌లపై అవగాహన.శక్తి టీమ్స్ ద్వారా వేలాది మహిళలకు భద్రతా యాప్‌లు,టోల్ ఫ్రీ సేవలపై సమాచారం.పోక్సో, ఈవ్‌టీజింగ్,సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం.చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు నమోదు-మహిళల భద్రతే తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం.తిరుపతి జిల్లా  తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియంలో మహిళలు మరియు చిన్నారుల భద్రత సాధికారత,చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు,ఐపీఎస్ హాజరై మహిళలు,విద్యార్థినులు మరియు చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అత్యంత కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ సర్కిల్ సబ్ డివిజన్ పరిధిలో మహిళల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మంది మహిళలను ప్రత్యక్షంగా కలుసుకుని భద్రత,చట్టపరమైన హక్కులు,అత్యవసర సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.మహిళలు మరియు పురుషులు సమాన అవకాశాలతో ముందుకు సాగినప్పుడే కుటుంబం సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో మంచి నడవడిక,పరస్పర గౌరవ భావన, బాధ్యతాయుతమైన ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు కేవలం విద్య మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కూడా అందించాల్సిన బాధ్యత ఉందని సూచించారు.ప్రస్తుతం సైబర్ యుగంలో సెల్ ఫోన్లు,సోషల్ మీడియా దుర్వినియోగం కారణంగా మహిళలు, చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ కల్పించాలని, టెక్నాలజీని అవసరానికి మించి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు భద్రతా యాప్‌లు,టోల్ ఫ్రీ నంబర్లు, అత్యవసర సమయంలో పోలీసుల సహాయం ఎలా పొందాలి అనే అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసి,సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.మహిళలు చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారిపై రౌడీషీట్లు నమోదు చేయడం,కౌన్సెలింగ్ నిర్వహించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చిన్నారులతో ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలను అడిగి తెలుసుకుని సమగ్ర సమాధానాలు ఇచ్చారు. చిన్నారులు కూడా మిక్కిలి ఉత్సాహంతో జిల్లా ఎస్పీ ని వివిధ ప్రశ్నలు అడిగి సంతృప్తికరమైన సమాధానాలు పొందారు.ఈ సందర్భంగా విద్యార్థులకు భద్రత,చట్ట అవగాహన,సైబర్ జాగ్రత్తలపై విలువైన సూచనలు చేశారు.మీడియా ద్వారా జిల్లా ప్రజలకు సందేశమిస్తూ,మహిళలు మరియు చిన్నారుల భద్రత విషయంలో తిరుపతి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే డయల్-112 లేదా ఇతర టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతే తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మహిళలు,విద్యార్థినులు చిన్నారులు అశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి శ్రీ రవి మనోహరచారి (శాంతి భద్రతలు) డీఎస్పీలో శ్రీ భక్తవత్సలం (తిరుపతి), శ్రీమతి శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్( డాక్టర్ శ్రీమతి దుర్గాదేవి (పోలీస్ డిపార్ట్మెంట్) మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిజీషియన్ అలాగే సిఐలు శ్రీ విక్రమ్ (ఎస్బి )శ్రీ రామకృష్ణ (వేస్ట్) తమిమ్ అహ్మద్ (మహిళా పోలీస్ స్టేషన్)పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.