📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriడబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి   ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాల

డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి   ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాల

📰 Generate e-Paper Clip

డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి… ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాలా…..?
డబుల్ బెడ్‌రూమ్ మోసాలు మర్చిపోయి… ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై డ్రామాలా…..?

పేదల ఇళ్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు : ఆసర్ల బీరప్ప

మేడిపల్లి మే 26( మన ప్రజావాణి) ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆసర్ల బీరప్ప తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మేడ్చల్ నియోజకవర్గంలోనే వేలాది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు కొనసాగుతున్నాయని, కావాలంటే ఆధారాలతో నిరూపిస్తామని ఆయన తెలిపారు.వేల ఇందిరమ్మ ఇళ్లు చూపిస్తా… కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.అబద్ధాల ప్రచారమే కేటీఆర్ రాజకీయాల పునాది అని విమర్శించిన బీరప్ప,పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రచారం చేసి వేలాది పేదలను నిరాశపరిచిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.కాంగ్రెస్ పనులు కనిపించకపోతే కేటీఆర్ రాజకీయ కళ్లజోడు మార్చుకోవాలి.పేదల ఇళ్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని వ్యాఖ్యానించారు.ఇలాంటి అహంకారపు మాటలతోనే ప్రజలు కేటీఆర్‌ను గద్దె దించారు.అహంకారం, అవాస్తవాలే బీఆర్ఎస్ పతనానికి కారణం అని బీరప్ప విమర్శించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకుని, బీఆర్ఎస్ హయాంలో నెరవేరని హామీలపై ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.