📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి బాలికలకు పురస్కారాలు

చండూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి బాలికలకు పురస్కారాలు

📰 Generate e-Paper Clip

*చండూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి బాలికలకు పురస్కారాలు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు ఉన్నత పాఠశాలలో 2025 -26 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలు కారింగు ఐశ్వర్య, సోమ గౌతమి, కొంపెల్లి గుణశ్రీ లకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పురస్కారాలు ఇస్తున్నారు. చండూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయిలో పదవ తరగతి ఫలితాలను సాధించడం పట్ల చండూరు పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. సోమ గౌతమి సభలో ఆంగ్లంలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ. కోటీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు బి. సైదులు, కళ్లెం వెంకటరెడ్డి, జి. వెంకటేశ్వర్లు కే.శ్రీనివాస్ వై.యాదగిరి విద్యార్థుల వెంట ఉండి మునుగోడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.