📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టుపై బెదిరింపులు: సింగల్ విండో ప్రెసిడెంట్ పై కేసు నమోదు

జర్నలిస్టుపై బెదిరింపులు: సింగల్ విండో ప్రెసిడెంట్ పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా (మే 25) ప్రజావాణి పోరుమామిళ్ల:జర్నలిస్టుపై దుర్భాషలాడి, ప్రాణభీతి కలిగించేలా బెదిరింపులకు పాల్పడిన పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి వెంకట కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మైదుకూరు డీఎస్పీ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోరుమామిళ్లకు చెందిన సీనియర్ రిపోర్టర్ దియ్యాల శ్రీనివాసులు ప్రైమ్ 9 టీవీలో పోరుమామిళ్ల, కలసపాడు,బి.కోడూరు, శ్రీ అవధూత కాశినాయన మండలాల రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.కాగా, పోరుమామిళ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్‌గా ఉన్న కల్లూరి వెంకట కృష్ణారెడ్డి, ప్రైమ్ 9 సంస్థకు చెందిన క్యాలెండర్ ప్రకటన (అడ్వర్టైజ్‌మెంట్) నిమిత్తం రూ. 15,000 ఇవ్వాల్సి ఉంది. అయితే ఐదు నెలలు గడిచినా సదరు మొత్తాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.ఈ నెల 23న ఉదయం,సాయంత్రం వేళల్లో జర్నలిస్ట్ శ్రీనివాసులు ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పటికీ కృష్ణారెడ్డి నుంచి స్పందన కరువైంది.దీంతో ఆయన కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లడంతో.ఆ సమయంలో కృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.జర్నలిస్టును నోటికొచ్చినట్లు దుర్భాషలాడటమే కాకుండా,తల్లిని దూషిస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించాడడు.బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బద్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడు ఆవుల కిషోర్, ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రఘురాములు,నరసింహ, సురేష్ బాబు, అన్నిక కిషోర్, కమల్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, ప్రసాద్, మైదుకూరు డీఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుపై దాడి ప్రయత్నం, బెదిరింపుల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన డీఎస్పీ, తక్షణమే కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.డీఎస్పీ ఆదేశాల మేరకు పోరుమామిళ్ల ఎస్ఐ పి. హనుమంతు స్పందించి, మే 24న సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకట కృష్ణారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ (నెం. 65/2026) నమోదు చేశారు. కొత్త చట్టం (BNS) లోని సెక్షన్లు 126(2), 351(2) కింద కేసు నమోదు చేసి,దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.