నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చి మోసము చేసిన ముఠా పై చర్యలు తీసుకోవాలి..
బాధితులకు న్యాయము చేయాలి
జనశక్తి రాష్ట్ర నేత కోనేరు రమేష్ డిమాండ్
పలాస ప్రజావాణి ప్రతినిధి
పలాస ఉద్దానను లో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముఠా పై చర్యలు తీసుకోవాలని జనశక్తి రాష్ట్ర నేత కోనేరు రమేష్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆధార్ కార్డులు ఇస్తామని వేల రూపాయలు వసూలు చేసి నమ్మి సొమ్ములు ఇచ్చిన వారికి ఎందుకు పనికిరాని ఆధార్ కార్డులు ఇచ్చారని ఆయన ఆగ్రహము వ్యక్తము చేశారు. ప్రభుత్వము ఇచ్చే ఫెన్సన్ కోసము ఆధార్ కార్డులు ఇస్తామని, నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి మోసము చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఫెన్సన్ మంజూరు కోసము ఆధార్ కార్డులు ఇస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద ఐదు వేల రూపాయలు నుంచి పదివేల రూపాయలు వరకు వసూలు చేశారని జనశక్తి రాష్ట్ర నేత కోనేరు రమేష్ అన్నారు..అధికారులు జోక్యం చేసుకొని ఆధార్ కార్డులు బాధితులకు న్యాయము చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

