📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లాలోని ఎస్సీ ఎస్టీ విలేకరులు ఈనెల 30 31 తేదీల్లో జరిగే శిక్షణ తరగతులకు...

కడప జిల్లాలోని ఎస్సీ ఎస్టీ విలేకరులు ఈనెల 30 31 తేదీల్లో జరిగే శిక్షణ తరగతులకు హాజరుకండి

📰 Generate e-Paper Clip

కడప (మే 20) ప్రజావాణి న్యూస్) జిల్లాలోని ఎస్సీ ఎస్టీ విలేకరులు ఈనెల 30 31 తేదీల్లో జరిగే శిక్షణ తరగతులకు హాజరుకండ జిల్లా ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో సి ఆర్ మీడియా అకాడమీ వారు నిర్వహించే పునఃశ్చరణ తరగతులకు గ్రామీణ ప్రాంత ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అందరూ హాజరై మెలుకువలు నేర్చుకోవాలని అన్నారు. అక్రిడేషన్ లేదు కదా అనే బాధ లేకుండా యాజమాన్యం ఇచ్చిన ఐడి కార్డు ఉంటే చాలని వార్తలు నిర్భయంగా రాయాలని ఎవరికీ భయపడకుండా తమ కర్తవ్యాన్ని సక్రమంగా రీతిలో వార్త కథనాలు ప్రచురించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ శిక్షణ శిబిరాలకు అనుభవజ్ఞులైన పాత్రికేయులచే పత్రికా కథనాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ తరగతులు ఉంటాయని అన్నారు. వార్త కథనాలు రాయడంలో కృత్రిమ మేధ వంటి ఆధునిక పద్ధతులు వినియోగించి ఎలా వార్త రాయాలి లీడ్ ఏం పెట్టాలి అనే అంశాలపై శిక్షణ ఉంటుందని అన్నారు. అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టు శ్రీ విజయకుమార్ కుర్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విలేకరులకు తెలియజేస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతా రిపోర్టర్లు వార్త సేకరణలో ఎదురయ్యే సమస్యలను మెలకువలను క్రైమ్ వార్తలు ఎలా రాయాలి పత్రిక భాష వంటి అంశాలపై రెండు రోజులు శిక్షణ తరగతులు ఏసీ ఎస్టీ జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో పాల్గొనే వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని విషయం అందరూ గమనించి గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అలపాటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతులు గ్రామీణ విలేకరులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తప్పకుండా హాజరై మెళుకువలు పొందాలని కోరారు. ఈనెల 30 31 తేదీల్లో కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే సమావేశంలో ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.