📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyవీరన్నపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భారీ సహాయం - అంజయ్య యాదవ్ సేవలు ప్రశంసనీయం

వీరన్నపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భారీ సహాయం – అంజయ్య యాదవ్ సేవలు ప్రశంసనీయం

📰 Generate e-Paper Clip

ప్రజల మాటే ప్రామాణ్యం… అంజయ్య యాదవ్ సహాయం

వీరన్నపేటలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భారీ సహాయం – అంజయ్య యాదవ్ సేవలు ప్రశంసనీయం

 

జిల్లేడు చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో హనుమాన్ దేవాలయ నిర్మాణం జరుగుతుండగా, గ్రానైట్ అవసరం ఉందని స్థానిక గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రామస్థుల అభ్యర్థనను గౌరవిస్తూ ఆయన వెంటనే స్పందించి, దేవాలయ నిర్మాణ పనులు ఆగకుండా కొనసాగేందుకు రూ.4 లక్షల విలువైన గ్రానైట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అంజయ్య యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఆయన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, గ్రామ సర్పంచ్ సుమలత వెంకట్రాములు, మాజీ సర్పంచ్ గౌస్, మాజీ ఎంపీటీసీలు రాములు, మాణయ్య, నాయకులు జిల్లేడు వెంకటేష్, జగదీష్, నర్సింలు, రామచంద్రయ్య, మోతిలాల్, రాజు, స్థానికులు జహంగీర్, సలీం, సత్యం, నర్సింలు, అమీర్, శేఖర్, శివ, చంద్రబాబు, బుచ్చయ్య, లక్ష్మయ్య, బాలరాజు, సోహైల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.