📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyరామచంద్రాపురం నుండి రేగడి చిలకమర్రి వరకు మరొక మూడు హైలెవల్ బ్రిజ్జి లు శంకుస్థాపన చేసిన...

రామచంద్రాపురం నుండి రేగడి చిలకమర్రి వరకు మరొక మూడు హైలెవల్ బ్రిజ్జి లు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం నుండి రేగడి చిలకమర్రి వరకు మరొక మూడు హైలెవల్ బ్రిజ్జి లు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న

రామచంద్రపురం – మహాదేవపూర్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

బైరంపల్లి – ఉత్తరాస్ పల్లి రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

 

ఉత్తరాస్ పల్లి – ముటుపూరు రహదారిపై టవర్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

 

అతి త్వరలో గౌరవ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిచే రామచంద్రపురం రేగడి చిలకమర్రి డబుల్ రోడ్డు మరియు ముటుపూరు గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామాల వెంట పాదయాత్ర చేస్తూ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని మారుమూల గ్రామాల మౌలిక అవసరాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నెరవేర్చుతానని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మారు మూల గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకొని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తూ అలాగే వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నందున వాటిపై హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించడం జరిగింది

అలాగే అతి తొందరలో రామచంద్రపురం నుండి రేగడి చిలకమర్రి వరకు డబుల్ రోడ్డు మంజూరు అవుతుందని అలాగే విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్నందున ముట్పూర్ గ్రామంలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు కూడా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిచే ప్రారంభోత్సవం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది

అలాగే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తామని మిగిలిన అన్ని హై లెవెల్ బ్రిడ్జిలను కూడా మంజూరు చేయిస్తానని తెలియజేయడం జరిగింది

కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాజీ సింగల్ విండో అధ్యక్షులు దామోదర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డి మాజీ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మండల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్,రాయి కంటి కృష్ణారెడ్డి,కేకే కృష్ణ మంగులాల్ నాయక్ మాజీ ఎంపీటీసీలు అంజిరెడ్డి మల్లేష్ గౌడ్ సర్పంచ్ లు కనకమామిడి అంజయ్య, శ్రీకాంత్, అమర్నాథ్ రెడ్డి, విక్రం రెడ్డి, గోపాల్,శ్రీశైలం మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పహిల్వాన్,ఉప సర్పంచ్ సరిత రవి జహంగీర్ ద్విజేందర్ రామచంద్రయ్య రవీందర్ రెడ్డి, శివ ఆదిల్, బాల్ రెడ్డి శ్రీనివాస్, హమీద్ సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శులు అధికారులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.