📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyమధ్యాహ్న భోజనం కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

మధ్యాహ్న భోజనం కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

మధ్యాహ్న భోజనం కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బికేఎంయు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ ఇన్చార్జి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, జిల్లెడు చౌదరిగుడా ఏఐటీయూసీ మండల గౌరవ అధ్యక్షులు జిల్లెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జూన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం టిఫిన్ పెట్టాలని ప్రతిపాదన తీసుకువచ్చింది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న కనీస వేతనం నెలకు 3000 రూపాయలు అవి కూడా ఒక్కసారి ఇవ్వడం లేదు ఉదయం టిఫిన్ పెట్టాలంటే ఉదయం తో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకరోజు మొత్తం పని చేయవలసిన పని ఉన్నది. ప్రభుత్వం ఇచ్చే వేతనం ఏ మేరకు సరిపోని పరిస్థితి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి గ్యాస్ ధరలు కూడా పెరిగాయి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మెనూ చార్జీలు పెంపుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు అమలు చేయాలి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి. మధ్యాహ్న భోజన కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డులు సౌకర్యం కూడా కల్పించాలి. నిత్యవసర వస్తువులు అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సప్లై చేయాలని కోరుతున్నాము. మా విన్నపాన్ని మన్నించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ జిల్లాలు చౌదరిగుడా మండల అధ్యక్ష కార్యదర్శులు చోటే మియా, శేఖర్ గౌడ్, శివ కల, కృష్ణయ్య, అరుణమ్మ, రాజేశ్వరి, లక్ష్మి, స్వప్న, దివ్య, గంగ, జంగమ్మ, భాగ్యమ్మ, తదితరులు కార్మికులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.