📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే వసూల్ రాణి మంత్రి మాటలు దయ్యాలు...

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే వసూల్ రాణి మంత్రి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కడప ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్2)కడప నగరం వైఎస్ఆర్ సి పి జిల్లా కార్యాలయం లో జిల్ల అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరానే వసూల్ రాణి,మంత్రి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది.హార్టికల్చర్ అగ్రికల్చర్ రైతులు ధరలు లేక నష్టపోతున్నారు.. సీఎం వస్తున్నారంటే జిల్లా అధికారులతో అభివృద్ధి,సమస్యలపై అధికారులతో సమీక్ష చెయ్యాల్సి ఉంటుంది.వచ్చిన పని చూసుకొని పొతే అందులో ఏముంటుంది.బీసీ జనార్దన్ రెడ్డి కమలాపురం కు వచ్చారు రైల్వే వంతెనకు భూమి పూజ చేసారు.కానీ ఆయనేదో చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు.జగన్ మేనమామ రెండు సార్లు ఎమ్మెల్యే గా వున్నందుకు సిగ్గుపడాలి అని మంత్రి వాఖ్యలు చేసారు.కమలాపురంలో ఏమి అభివృద్ధి జరిగిందో మం త్రి పట్టణంలో తిరిగితే తెలిసేది.ఇరుకైన అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ చేపట్టాం.వర్షాలు వచ్చిన ప్రతీ సారి మునకకు గురయ్యే పరిస్థితి ఉంటే దాన్ని చక్కదిద్దాం.పాలిటెక్నిక్ కళాశాల,ప్రభుత్వ వైద్యాశాలలను నిర్మించడం జరిగింది.త్రాగునీటి, డ్రైనేజీ వ్యవస్థ చక్కదిద్దడం జరిగింది,రైల్వే వంతెనకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయించాం.దేశవ్యాప్తంగా 67 మంజూరు చేస్తే ఏపీలో కమలాపురం వంతెనకు నిధులు మంజూరు చేసారు.క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏమిలేదు.ఎమ్మెల్యే,ఎమ్మెల్యే తండ్రి,మంత్రి జనార్దన్ రెడ్డి చర్చకు వస్తారా సవాల్.ఇసుక మట్టి దోపిడీ చేస్తున్నదెవరు.యంత్రాలను పెట్టి రోజుకు 25లక్షల నుంచి 30లక్షలు సహజ వనరుల నుంచి దోచుకుంటున్నారు.కడప నుంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి.క్రషర్ లను పెట్టి ముమ్మరంగా మైనింగ్ దోచేస్తున్న మంత్రి.ఎ పని చెయ్యాలన్నా దానికో రేటు కట్టి వసూళ్లు చేస్తున్నారు.జగన్ మేనమామ అయినందుకు గర్వపడుతున్నా.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.