📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ నిర్వహణ

గుగ్గిళ్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ నిర్వహణ

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ నిర్వహణ

 

బెజ్జంకి, ఏప్రిల్ 2(ప్రజావాణి)

 

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య అధ్యక్షత వహించగా,వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన రైతు భరోసా పథకం ద్వారా గ్రామంలో 783మంది,రైతు భీమా ద్వారా ఇద్దరు,ఇందిరమ్మ ఇండ్లు 22 మంజూరవగా 5 ఇండ్లు పూర్తియ్యాయని మిగతావి నిర్మాణంలో ఉన్నాయన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా గ్రామంలో 409 మంది లబ్ధి పొందుతున్నారన్నారు.మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్ల కొనుగోలు బోనస్, చేయూత పెన్షన్, గృహజ్యోతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల గురించి వివరించారు.రైతు బోనస్ 6 మంజూరుఅయ్యాయని,గ్రామంలో సుమారు 70 కొత్త రేషన్ కార్డులుమంజూరు ఆయ్యాయన్నారు.కళ్యాణ్ లక్ష్మి చెక్కులు సుమారు 12 మంది వరకు లబ్ది పొందారని,అర్హులైన వారు వృద్ధాప్య పింఛన్ కోసం 60 సంవత్సరాలు నిండిన వారు గ్రామ పంచాయతీ వద్ద జిపివో నీ దగ్గర నమోదు చేసుకోవాలని, గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి అర్హత కలిగిన వారు తమ పేర్లు నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య, కొంకటి సంపత్, కొంకటి కుమార్, పంతంగి వెంకటేష్ గౌడ్, కొంకటి సురేష్, దూశెట్టి రాజిరెడ్డి,సీత రేణుక, ర్యాకం అనిత, పోతూ భూలక్ష్మి, గుగ్గిళ్ల లావణ్య,అంగన్‌వాడీ టీచర్ శోభ, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు,గ్రామ పాలనా అధికారి శ్రీనివాస్, ఏఈవో తేజస్విని, పంచాయతీ కార్యదర్శి వంశీ, కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ బోయిని ప్రశాంత్, విద్యాసంస్థల ప్రతినిధులు, ఆశ వర్కర్ రజిత,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.