📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

బెజ్జంకిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

బెజ్జంకి,ఏప్రిల్11(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఐలేని శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పూలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. సమాజంలో సామాజిక న్యాయం స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఎస్సై సౌజన్య, ఉపసర్పంచ్ ధూమాల మహేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.