📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం...-రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.-ఆరోగ్యం...

ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం…
-రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
-ఆరోగ్యం అనేది మానవునికి అత్యంత గొప్పది.
-నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి.

📰 Generate e-Paper Clip

ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం…
-రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
-ఆరోగ్యం అనేది మానవునికి అత్యంత గొప్పది.
-నందిమేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి.

ధర్మారం, మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10

పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో 575 లక్షల తో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి రిబ్బన్ కత్తిరించి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఆరోగ్యం అనేది మానవునికి అత్యంత ప్రాముఖ్యమైందని, గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా,వారి ఇంటి వద్దనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
నంది మేడారం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడానికి ముందు తాను ఎన్నోసార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి ఆసుపత్రికి సంబంధించిన పరికరాలు,నిధులు,వైద్య సిబ్బంది గురించి ప్రతిపాదనలు అందించిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు.సామాజిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిశుభ్రత, నాణ్యమైన వైద్యం అందేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ధర్మారం మండలానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన ప్రతిపాదనలు అందించాలని, నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వా దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారు.నందిమేడారం పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని,ఆసుపత్రి భవన నిర్మాణం కొరకు స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన స్థలదాత కీర్తిశేషులు మురళీధర్ రావుకు వారి కుటుంబ సభ్యులకు,భవన నిర్మాణం కొరకు పనిచేసిన అధికారులకు,ఇంజనీర్లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత వైద్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు,సరిపడా మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని,ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో రాజీ పడబోమని,నందిమేడారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిరంతరం వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ లా నాయక్,వైస్ చైర్మన్ లింగయ్య,సర్పంచ్ వీర్ పాల్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్.ప్రమోద్ కుమార్,జిల్లా ఆసుపత్రి సూపర్ండెంట్ డాక్టర్. శ్రీధర్,ఆసుపత్రి సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు,  అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.