📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliనేరానికి తగిన శిక్ష….హత్య కేసులో జీవిత ఖైదు

నేరానికి తగిన శిక్ష….హత్య కేసులో జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

నేరానికి తగిన శిక్ష….హత్య కేసులో జీవిత ఖైదు

పెద్దపల్లి,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జూలపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాచాపూర్ గ్రామానికి చెందిన జాడి కనకయ్య (65) తన అల్లుడు చేత్తయ్య,అశోక్‌పై అనుమానాల నేపథ్యంలో పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన ఘటనలో, పెద్దపల్లి జిల్లా కోర్టు నిందితుడి నేరాన్ని రుజువు అయ్యిందని తేల్చింది.దీంతో కోర్టు నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.ఈ ఘటన 2024 ఆగస్టు18న చోటుచేసుకోగా, కుటుంబ విభేదాలు, అనుమానాల కారణంగా నిందితుడు తన అల్లుడిపై బండరాయి,ఇనుప రాడ్డు‌తో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది.బాధిత కుటుంబ సభ్యురాలు జేజేలా శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి,నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవి సాక్ష్యాధారాలను సమర్పించి నేరాన్ని రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించారు.పోలీసు అధికారుల సమన్వయంతో సాక్షులను సమర్థంగా ప్రవేశపెట్టడం ద్వారా కేసు బలపడింది.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని రామగుండం కమిషనర్ అభినందించారు. న్యాయం ఆలస్యమైనా తప్పదు నేరానికి తగిన శిక్ష పడుతుందనే సందేశాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టంచేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.