📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalజిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కంది కృష్ణచైతన్య రెడ్డి

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కంది కృష్ణచైతన్య రెడ్డి

📰 Generate e-Paper Clip

చెన్నారావుపేట ఏప్రిల్ 14 (ప్రజావాణి)

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కంది కృష్ణచైతన్య రెడ్డి


చెన్నారావుపేట ఏప్రిల్ 14 (ప్రజావాణి)


వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందినా కంది కృష్ణచైతన్య రెడ్డి నియమితులయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో పార్టీ అధిష్టానం ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది.

పార్టీ బలోపేతమే లక్ష్యం

సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ, నియోజకవర్గ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణచైతన్య రెడ్డి.. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన భార్య శ్వేత (సర్పంచ్) గెలుపులో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయనలోని ఉత్సాహాన్ని, పనితీరును గుర్తించిన నాయకత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది.


ఎమ్మెల్యే దొంతికి కృతజ్ఞతలు


తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృష్ణచైతన్య రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సహకరించిన నియోజకవర్గ, మండల నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం మండలంలో మరియు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.