📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalనాడు తల్లిని నేడు తండ్రిని కోల్పోయిన స్నేహితురాలిని పరామర్శించినా..అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థినిలు.

నాడు తల్లిని నేడు తండ్రిని కోల్పోయిన స్నేహితురాలిని పరామర్శించినా..

అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థినిలు.

📰 Generate e-Paper Clip

నాడు తల్లిని నేడు తండ్రిని కోల్పోయిన స్నేహితురాలిని పరామర్శించినా..

అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల విద్యార్థినిలు.

మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత.

చెన్నారావుపేట ఏప్రిల్ 14 (ప్రజావాణి)

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న ఉప్పరపల్లి గ్రామానికి చెందినా కుక్కల సింధు తండ్రి రాజు సోమవారం నాడు మరణించిన విషయం తెలుసుకున్న తన తోటి కళాశాల లో చదువుకునే స్నేహితులు మంగళవారం నాడు తమ నివాసం ఉప్పరపల్లి గ్రామంలో కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం మూడువేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తోటి చదువుకునే తమ స్నేహితురాలు చిన్నప్పుడే (నాడు)తల్లిని నేడు తండ్రిని కోల్పోవడం తమకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తమ స్నేహితురాలు  కుక్కల సింధు ఆమె సోదరి రమ్యశ్రీ బాబాయ్ పిన్ని కుక్కల సుమలత మహేందర్, స్నేహితులు మన్నెం స్రవంతి, పంతంగి సమీరా, మర్ద వర్షశ్రీ ,మంద రచన ,చిలపాక వర్షిత, ముస్కు సింధుజ సీనియర్ పాత్రికేయులు మన్నెం వీరేందర్ రెడ్డి ,పంతంగి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.