📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్కోచ్ అవార్డు అందు కోనున్న వై ఎస్ ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.

స్కోచ్ అవార్డు అందు కోనున్న వై ఎస్ ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)వైఎస్ఆర్ కడప,జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన “స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్”:డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన మధ్యాహ్న భోజనమును అందించేందుకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానము ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు.ఈ స్మార్ట్ కిచెన్ విధానం ఒక మోడల్ గా ఉంటూ.మన్ననలు పొందుతోంది ఈ నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి.ఈ ప్రాజెక్ట్‌ కు గాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు  కు ఎంపికయ్యారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం,ఆహార భద్రతను పరిరక్షించడం, ఆధునిక యంత్రాలతో వంటశాల మరియు ఆటోమేషన్ వినియోగం,సాంకేతికత సమర్థ వినియోగం,సరైన నిధుల వినియోగం,పంపిణీలో పారదర్శకత వంటి అంశాల్లో ఈ ప్రాజెక్ట్ విశేష ప్రతిభను చూపింది.ఈ కృషి ని గుర్తించిన స్కోచ్ సంస్థ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ను ప్రశంసించింది.2026 మార్చి 28 న న్యూ ఢిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగే 106 వ స్కోచ్ సమ్మిట్‌లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వారు అవార్డును స్వీకరించనున్నారు.స్కోచ్ అవార్డు అనేది భారతదేశ అభివృద్ధికి దోహదపడే వ్యక్తులు,సంస్థలు మరియు ప్రాజెక్టులను గుర్తించడానికి స్వతంత్ర స్కోచ్ గ్రూప్ ఇచ్చే ఒక పురస్కారం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.