📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారుల..ప్లాస్టిక్.. వేషాలు..పేదోడిపై ప్రతాపం.. బడా బాబులతో బేరసారాలు..! వసూళ్ల కోసమే..నిర్మూలన.. నాటకం..?

ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారుల..ప్లాస్టిక్.. వేషాలు..పేదోడిపై ప్రతాపం.. బడా బాబులతో బేరసారాలు..! వసూళ్ల కోసమే..నిర్మూలన.. నాటకం..?

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)ప్రొద్దుటూరుమున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందా. పర్యావరణ పరిరక్షణ పేరుతో అధికారులు ఆడుతున్న నాటకాలు చూస్తుంటే సామాన్య ప్రజలకు అసహ్యం వేస్తోంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ మహమ్మారిని అంతం చేయాలని కఠిన చట్టాలు తెస్తే,ఇక్కడి అధికారులు మాత్రం ఆ చట్టాన్ని తమ..వసూళ్ల దందా.కు పెట్టుబడిగా మార్చుకున్నారు. రెండు రోజుల హడావుడి,వందల ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్టులు.ఇదంతా కేవలం ప్లాస్టిక్ మాఫియా నుంచి..అమ్యామ్యాలు.లాగేందుకేనన్న విమర్శలు ఇప్పుడు పట్టణమంతా గుప్పుమంటున్నాయి.చిరువ్యాపారుల ఉసురు పోసుకుంటున్న గూండా మనస్తత్వం.​రోడ్డు పక్కన తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే వాడు,ఆకలి తీర్చే టిఫిన్ సెంటర్ నడుపుకునే వాడు.వీరేనా మీకు కనిపించే నేరస్థులు.అధికారులారా,మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పేదవాళ్ల వద్ద ప్లాస్టిక్ కవర్లను దౌర్జన్యంగా లాక్కోవడంలో చూపిన ప్రతాపం,పట్టణంలోని భారీ గోడౌన్ల వద్ద ఎందుకు ప్రదర్శించలేకపోయారు.చిరువ్యాపారులపై గర్జించే మీరు,ప్లాస్టిక్ హోల్ సేల్ వ్యాపారుల వద్దకు వెళ్లేసరికి తోక ముడిచిన పిల్లుల్లా ఎందుకు మారుతున్నారు.ఇది కేవలం అధికార దుర్వినియోగం మాత్రమే కాదు,వ్యవస్థీకృత అవినీతి.డ్రామా వెనుక అసలు స్కెచ్ ఇదే.కేవలం రెండు మూడు రోజులు మాత్రమే సాగిన ఈ ప్లాస్టిక్ నిర్మూలన డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యం పట్టణ ప్రజలకు అర్థమైపోయింది.ప్లాస్టిక్ గోడౌన్ల యజమానులను భయపెట్టి, వారి నుంచి భారీ స్థాయిలో మామూళ్లు వసూలు చేయడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని విశ్వసనీయ సమాచారం. మేము దాడులు చేస్తున్నాం.మీడియాలో వార్తలు వస్తున్నాయి.మా నోరు నొక్కాలంటే పెద్ద మొత్తంలో ముట్టజెప్పాల్సిందే అంటూ అధికారులే వ్యాపారులతో బేరసారాలకు దిగడం అత్యంత దారుణం.గోడౌన్ల అడ్రస్లు మేం చూపిస్తాం.తనిఖీ చేసే దమ్ముందా.మున్సిపల్ అధికారులారా.మీకు నిజంగా ప్రొద్దుటూరు పట్ల,ఇక్కడి ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా ఈ సవాల్ స్వీకరించండి. పట్టణంలో ప్లాస్టిక్ ఎక్కడ తయారవుతుందో,ఏ గోడౌన్లలో నిల్వ ఉందో,ఏ అంగళ్ల నుంచి సరఫరా అవుతుందో మాకు తెలుసు. మేము వేలెత్తి చూపిస్తాం.మీరు వాటిని సీజ్ చేసి,ఆ సరుకును తగులబెట్టే ధైర్యం చేస్తారా. లేక వారి దగ్గర తీసుకున్న లంచాలకు దాసోహమై మొహం చాటేస్తారా.అధికారులారా.మీ.వసూళ్ల రాజా.వేషాలను ప్రొద్దుటూరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన పేరుతో సామాన్యులను పీడించి,పెద్దల దగ్గర లంచాలు తీసుకునే పద్ధతి మార్చుకోకపోతే.ప్రజలే తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా ఫోటోలకు ఫోజులివ్వడం ఆపి, ప్లాస్టిక్ మూలాల మీద దెబ్బ కొట్టండి.. లేదంటే మీ అవినీతి చిట్టాను బహిరంగ పరుస్తాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.