📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీస్ వీక్లీ ఫైనాన్స్ ముఠా అరెస్ట్ అండ్ రిమైండ్

వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీస్ వీక్లీ ఫైనాన్స్ ముఠా అరెస్ట్ అండ్ రిమైండ్

📰 Generate e-Paper Clip

వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీస్   వీక్లీ ఫైనాన్స్ ముఠా అరెస్ట్ అండ్ రిమైండ్ 


ప్రజావాణి
మార్చ్ 17
కామారెడ్డి జిల్లా ప్రతినిధి



రుణాలు ఇప్పిస్తామని ముందస్తుగానే వడ్డీ వసూలు చేస్తున్న వీక్లీ ఫైనాన్స్ ముఠా సభ్యుల్లో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు. పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం వారు వివరాలు వెల్లడించారు.
అవసరాలను ఆసరాగా తీసుకుని

సాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి వడ్డీ వసూలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కొత్త బస్టాండ్ .వద్ద మాటు వేశారు. ఈ సందర్భంగా ముఠాలో ఇద్దరు వడ్డీ వసూళ్ల రాయుళ్లు రాగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు సత్తి సాయిరాం, రాజులుగా గుర్తించి.. వారి వద్ద నుంచి వందలాది ప్రామిసరీ నోట్స్, ఖాళీ చెక్కులు, వేలిముద్రలు తీసుకున్న పత్రాలు, బంగారం, నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాళ్లు కామారెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ .రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో సైతం ఇలాంటి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.