📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamరియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన "ఆ నియోజకవర్గం"..?

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన “ఆ నియోజకవర్గం”..?

📰 Generate e-Paper Clip

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డాగా మారిన “ఆ నియోజకవర్గం”..?

 

నాటి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని లాభసాటి వ్యాపారం..!

 

కాలువలు మాయం చేసి.. కోట్లు గడించిన కేటుగాళ్లు..?

 

దీంట్లో అధికారుల పాత్ర పై వెలువెత్తుతున్న విమర్శలు..?

 

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు వెలగబెడుతున్న ప్రబుద్ధులు..?

 

మన ప్రజావాణి ప్రత్యేక ప్రతినిధికి చిక్కిన సాక్ష్యాలు..?

 

మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రత్యేక ప్రతినిధి

 

తెలంగాణ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు సాక్షాత్తు ఎన్ఎస్పి భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యవహారం ఆ నియోజకవర్గంలో సంచలన కలిగిస్తోంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా ఓ నియోజకవర్గంలో నాటి ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ ఏర్పడినప్పటి నుండి ఉన్న పంటకాలను ధ్వంసం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులకు కాసులను వలగా విసిరి సాక్షాత్తు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు విమర్శలు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు ఎకరం కోటి రూపాయలు చొప్పున కొనుగోలు చేసి నేషనల్ హైవే పక్కన ఎన్ఎస్పి కాల్వలను ధ్వంసం చేసి విలాసవంతమైన భవనాలను నిర్మించి దర్జాగా కాలక్షేపం చేస్తున్నట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాగా దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొందరు రాజకీయ నేతలతో పాటు నేటి ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం విశేషం. కాగా క్షేత్రస్థాయిలో ప్రజావాణి స్టేట్ ప్రత్యేక ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వ సంపదను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 32 సంవత్సరాల క్రితం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాలకు నీళ్లు ఎద్దుతున్న నేపథ్యంలో ఇది అదునుగా భావించిన నాటి ప్రభుత్వంలోని కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా కు అన్ని రకాలుగా సహకరించినట్లు ఆ మేరకు వెంచర్లు నిర్మాణం చేసి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ నిర్మాణం నుండి మేజర్ మైనర్ ఫీల్డ్ చానల్స్ ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఎన్ఎస్పి కాలువలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జిల్లా డివిజనల్ అధికారులకు తెలిసినప్పటికీ నేటి ప్రభుత్వ హయాంలో కూడా చర్యలు తీసుకోకపోవడంతో కొందరు రైతులు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత ఎన్ఎస్పి అధికారులను సంప్రదించగా రికార్డులు చూసి చెప్తాం వాస్తవంగా కాలువ ఉన్నదని తెలిసింది.. ఇటీవల అంటే సంవత్సరం నర క్రితం బదిలీపై ఈ ప్రాంతానికి వచ్చానంటూ ఓ ఎన్ ఎస్ పి అధికారి మన ప్రజావాణి ప్రతినిధికి వివరణ ఇచ్చారు. కాగా ఈ విషయం పై సమగ్ర విచారణ చేసి పంట కాలువలు ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యాపారులపై కీలక సూత్రధారులు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజా సంఘాల కార్యకర్తలు రైతులు కోరుతున్నారు.

 

పూర్తి వివరాలు తరువాయి భాగంలో..!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.