📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మైనర్ బాలికను మోసగించి, లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిని అరెస్ట్

మైనర్ బాలికను మోసగించి, లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిని అరెస్ట్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్(మార్చి14)గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు,గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS గారి ఆదేశాల మేరకు,మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.మైనర్ బాలికలపై జరిగే నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ బాలికలకు ఇష్టం ఉన్నా,ఇష్టం లేకున్నా వారితో శారీరకంగా కలవడం లేదా వివాహం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించడం జరుగుతుందని గౌరవ జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.కేసు వివరాలు:Cr.No.180/2026 U/s 137(2),64(1),64(2)(m),351(2) BNS & Sec.6 r/w 5(l) POCSO Act–2012 (ముందుగా Girl Missing కేసుగా నమోదు చేయబడినది)నిందితుడు: యాకసిరి ఆనంద్,తండ్రి:దుర్గారావు,వయస్సు 22 సం.లు,3వ వార్డు, పొట్లూరివారి వీధి,రేపల్లె,బాపట్ల జిల్లా.సంఘటన వివరాలు:బాధితురాలు 2025 అక్టోబర్ నెలలో గుంటూరు నగరంలోని ఒక స్వీట్ షాపులో సేల్స్ గర్ల్‌గా పని చేయడం ప్రారంభించింది. అదే షాప్‌లో నిందితుడు సేల్స్ బోయ్‌గా పనిచేస్తూ ఉండేవాడు. మొదట్లో బాధితురాలితో స్నేహంగా మాట్లాడి, ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు.తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసగించడానికి ప్రయత్నించాడు. బాధితురాలు తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పినా వినకుండా ఫోన్‌లో మాట్లాడాలని బలవంతం చేయడం, ఇంట్లో చెప్పితే కుటుంబ సభ్యులకు హాని చేస్తానని బెదిరించడం చేసేవాడు.ఒక రోజు షాప్ స్టాఫ్ ఎవరూ లేని సమయంలో నిందితుడు బాధితురాలిని బెదిరించి దేవపురం 4వ లైన్‌లో ఉన్న తన గదికి తీసుకెళ్లి, ఆమె ఇష్టం లేకపోయినా బలవంతంగా శారీరకంగా కలిసాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు.చివరిసారిగా ది 06.03.2026 తేదీన కూడా అదే విధంగా ఆమెతో శారీరకంగా కలసి, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.తదుపరి ది.07.03.2026 తేదీన బాధితురాలు ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో నిందితుడు ఆమెను బెదిరించి గుంటూరు బస్టాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుండి ఒంగోలు తీసుకెళ్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో బలవంతంగా తాళి కట్టి వివాహం చేసుకున్నట్లు నమ్మించాడు. అనంతరం ఆమెను తన తల్లిదండ్రులు ఉన్న రేపల్లెకు తీసుకెళ్లాడు.ఇంతలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ది.07.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయబడింది.దర్యాప్తు వివరాలు:ది.09.03.2026 తేదీన బాధితురాలు రేపల్లెలోని నిందితుడి ఇంటి నుండి ఎవరికి తెలియకుండా గుంటూరులోని తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాలను తన తల్లిదండ్రులకు తెలిపింది.అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన సంఘటనపై ఫిర్యాదు ఇచ్చారు.దీని ఆధారంగా మైనర్ బాలికను మోసగించి లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుడు అరెస్ట్:దర్యాప్తులో భాగంగా వచ్చిన విశ్వసనీయ సమాచారంతో, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS గారి ఆదేశాల మేరకు, 14–03–2026 ఉదయం 11:00 గంటలకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ Phase–II,శిల్పారామం వద్ద నిందితుడు యాకసిరి ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారు.దర్యాప్తు అధికారి: శ్రీ బి.వి. మధుసూదన రావు, DSP CCS మరియు ఇన్‌చార్జ్ SDPO,సౌత్ సబ్ డివిజన్, .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.