📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి "" వ్యవసాయ కార్మిక సంఘం

కూటమి ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ అమలు చేయాలి “” వ్యవసాయ కార్మిక సంఘం

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్(మార్చి14)కడప జెడ్ హెచ్ డి సి దళితుల భూములకు పట్టాలు ఆన్లైన్లో అమలు చేయాలి గ్రామాలలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ వెంకటేశ్వర్లు డిమాండ్ గ్రామాలలో భూమిలేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం భూపంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలోగ్రామీణ పేదల వలసల నివారణకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనులు 200 రోజులు పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు రెండు ఎకరాలు అమలు చేయాలని భూ సదస్సు జిల్లా అధ్యక్షులు జి శివకుమార్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ పేదలకు సెంటు భూమి భూ పంపిణీకి నోచుకోలేదు అన్నారు రాష్ట్రంలో పరిపాలించిన టిడిపి వైసిపి బిజెపి కూటమి ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు జిల్లాలో కాశి నాయన కలసపాడు పోరుమామిళ్ల బద్వేలు అట్లూరు బి కోడూరు బ్రహ్మంగారిమఠం మైదుకూరు ఖాజీపేట ఒంటిమిట్ట సిద్ధవటం నందలూరు రాజంపేట పెండ్లిమర్రి సికేదిన్న వియన్ పల్లె ముద్దనూరు తదితర మండలలో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన వారు ప్రజాప్రతినిధులు బంధువులు ధనవంతులు ఇతర జిల్లాలకు చెందిన వారు అనహ్రూలు 14 సంవత్సరాలలో 2 లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు భూ అక్రమాలకు పాల్పడినారు.అసైన్డ్ చట్టాన్ని 9/77 ఉల్లంఘించి రెవెన్యూ అధికారులతో లాలూచీపడి దొంగ పాస్ బుక్కులు పట్టాలు ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు బ్యాంకులలో లోన్లు పెట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున నిర్వహించారు సంవత్సరమైనా ఒక ఎకరం స్వాధీనం చేసుకోలేక పోయింది అన్నారు భూముల అన్యకాంతమైనయని అర్జీలు వచ్చినాయి వాటిని పరిగణనలోకి తీసుకొని పోలీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అనహ్రూలు వద్ద ఉన్న ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా 14 సంవత్సరాల నుంచి సాగులో ఉన్న పేదలకు కూడా పట్టాలు మంజూరు చేయాలన్నారు జిల్లాలో 50 సంవత్సరాల నుంచి జడ్ హెచ్ డి సి సొసైటీ భూములు సాగు చేస్తున్న గోపవరం ముత్తుకూరు నంద్యాల పేట చెములూరు చల్లగిరి గల రెవెన్యూ గ్రామాలలో దళితులకు పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా క్రాఫ్ ఇన్సూరెన్స్ రుణమాఫీ తదితర సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించటం సమంజసం కాదన్నారు వెంటనే వారందరికీ పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా అమలు చేయాలని కోరారు వి బి జి రామ్ జి స్కీంవల్ల గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతారు రాష్ట్ర ప్రభుత్వం పైన 40 శాతం నిధులు జమ చేయాల్సి ఉంటుంది కాబట్ట రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటివరకు కడప జిల్లాలో ఉపాధి పనులు కూలీలకు పనులు కల్పించలేదు గత సంవత్సరం ఉపాధి అధికారులు కూటం ప్రభుత్వం 50 రోజులకు మించి కూలీలకు పనులు కల్పించలేదు అన్నారు వెంటనే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసైన్డ్ భూములను 22 ఎ రద్దుచేసి కార్పొరేట్లకు 50 వేల ఎకరాలు అసైన్డ్ భూములు ఎకరం 99 పైసలకు ఇవ్వడం దుర్మార్గం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి అన్వేష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి శివ కుమార్ ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ కొనేటి నరసయ్య ఎంబడి పోలయ్య సురేష్ బాబు ఎన్ వీరయ్య అట్లూరు మండల కార్యదర్శి ఈ రమణయ్య కలర్స్ పాడు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎడ్జ లాజర్ కాశినాయన మండల కార్యదర్శి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరు మండల అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ డేవిడ్ రాజ్ బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్ష కార్యదర్శులు హరి గోవిందస్వామి సుబ్బమ్మ మైదుకూరు మండల్ నాయకులు బాల వెంకటయ్య సుబ్బరామయ్య పోరుమామిళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు సత్యమయ్య వీరభద్రయ్య ఒంటిమిట్ట కార్యదర్శి శివ సీకే దిన్నె పెండ్లిమర్రి తదితర మండలాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.