📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetములుగు, వర్గల్, మర్కుక్ మండలాల రైతులకు శుభవార్త..-ఐ ఐ హెచ్ ఆర్,సంస్థ విడుదల చేసిన అధిక...

ములుగు, వర్గల్, మర్కుక్ మండలాల రైతులకు శుభవార్త..-ఐ ఐ హెచ్ ఆర్,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ..

📰 Generate e-Paper Clip

ములుగు, వర్గల్, మర్కుక్ మండలాల రైతులకు శుభవార్త..-ఐ ఐ హెచ్ ఆర్,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ..

-ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

-ఉద్యాన శాఖ అధికారి సౌమ్య..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి

ములుగు, వర్గల్, మర్కుక్ మండలాలలో కూరగాయల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందించేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. బెంగళూరులోని,, ఐ ఐ హెచ్ ఆర్,,సంస్థ విడుదల చేసిన అధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ.. చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ పథకం ద్వారా టమాట, మిర్చి, వంకాయ, చిక్కుడు వంటి కూరగాయల విత్తనాలను ఒక్కో రైతుకు గరిష్టంగా 20 గుంటల భూమికి సరిపడే విధంగా అందజేస్తారు. ఆసక్తి ఉన్న రైతులు గురువారo& శుక్రవారం రోజుల్లో సంబంధిత అధికారులను సంప్రదించి విత్తనాలను పొందవచ్చని తెలిపారు.దరఖాస్తు చేసుకునే రైతులు క్రింది పత్రాలను సమర్పించాలి:ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్,పట్టా పాస్‌బుక్ జిరాక్స్,పాస్‌పోర్ట్ సైజు ఫోటో,మరిన్ని వివరాల కోసం రైతులు గజ్వేల్, ఉద్యాన విస్తరణ అధికారి పి. అరవింద్.9704389852 ఉద్యాన శాఖ అధికారి సౌమ్య, 8977714433.లను సంప్రదించవచ్చనిఅధికారులు తెలిపారు.ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని కూరగాయల సాగును విస్తరించాలని ఉద్యాన శాఖ సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.