📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఖమ్మం జిల్లాలో తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం.* ...

ఖమ్మం జిల్లాలో తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం.* *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి.*

📰 Generate e-Paper Clip

*ఖమ్మం జిల్లాలో తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం.*

 

*రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి.*

*అధికారులకు శాలువాలు కప్పి సత్కరించిన సోలార్ ప్లాంట్ నిర్వాహకులు బీరవల్లి శ్రీనివాసరావు.*

 

*రైతులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి.*

 

*తిరుమలాయపాలెం, ప్రజావాణి, మార్చి 10:*

 

ఖమ్మం జిల్లాలోని తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభించామని సోలార్ ప్లాంట్ నిర్వాహకులు బీరవల్లి శ్రీనివాసరావు అన్నారు..ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామ పరిధిలో 2.0 మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఖమ్మం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద జిల్లాలో ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసిన మొదటి సోలార్ ప్లాంట్ ఇదే ఆయన తెలిపారు..జిల్లాలో ఇప్పటివరకు 43 మంది రైతులు కలిపి సుమారు 70 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు..ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా రైతుకు 25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం లభించనుందని. అదేవిధంగా పునరుత్పాదక శక్తి వినియోగం పెరగడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తాయన్నారు… పీఎం కూసుమ్ పథకం రైతులకు అదనపు ఆదాయం పొందేందుకు ఒక మంచి అవకాశం అని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు తమ భూములను వినియోగించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి ఆర్థికంగా లాభపడవచ్చని పేర్కొన్నారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి,తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్ కుమార్,డిప్యూటీ ఇంజనీర్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, గ్రామ సర్పంచులు గూడూరు ఉపేందర్, నరేందర్ రెడ్డి,గండు చంద్రయ్య, గూడూరు ఉపేందర్,ఆత్మ కమిటీ చైర్మన్ ఓరా వెంకటేశ్వర్లు, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్, ఈపీసీ కాంట్రాక్టర్ పునర్వి ఎనర్జీస్ ప్రతినిధులు, టి జి ఆర్ ఈ డి సి ఓ ఫీల్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.