📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు కౌన్సిలర్లు శిక్షణ....

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు కౌన్సిలర్లు శిక్షణ. జిల్లా కలెక్టర్ కె. హైమావతి

📰 Generate e-Paper Clip

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు మరియు కౌన్సిలర్లు శిక్షణ

సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి

జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 12 వ తేదీన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచ్ లకు, మున్సిపల్ చైర్మెన్లు మరియు కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99రోజుల కార్యక్రమ ఆయా థీమ్స్ గూర్చి ప్రజాప్రతినిధులకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ప్రజాప్రతినిధులు, సర్పంచ్లకు, మున్సిపల్ చైర్మన్లు & కౌన్సిలర్ లకు వేరు వేరుగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఐడీ కార్డులు ఇవ్వాలని తెలిపారు. థీమ్స్ వారిగా జిల్లా అధికారులు కార్యక్రమ నిర్వహణ గూర్చి ఓరియెంటేషన్ క్లుప్తంగా వివరిస్తారు. అందరికీ కనిపించే విధంగా ఎల్ ఈ డి స్క్రీన్ ఏర్పాటు చెయ్యాలి. అలాగే విఐపి, జిల్లా అధికారులకు, మీడియా ప్రతినిధులకు సిట్టింగ్ అరేంజ్మెంట్ చెయ్యాలని తెలిపారు. రెండు సెషన్ ల వారిగా నిర్వహించే కార్యక్రమంలో అందరికీ తాగునీటి వసతి, మధ్యాహ్నం భోజన వసతి కల్పించాలని తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటు పాట్లు జరగకుండా పగడ్బందిగా ఏర్పాట్లు చెయ్యాలనీ అధికారులను ఆదేశించారు.

 

కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డి పి ఓ రవీందర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.