📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బొమ్మ వెంకన్న

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బొమ్మ వెంకన్న

📰 Generate e-Paper Clip

ఇందుర్తిలో ఘనంగా బొమ్మ వెంకన్న 7వ వర్ధంతి

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్లు 7వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు.అనంతరం చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ మాట్లాడుతూ…అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం పోరాడిన నిజమైన యోధుడు బొమ్మ వెంకన్న అని కొనియాడారు. ఇందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఈరోజు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పనులకు వేగం తీసుకొచ్చిన నాయకుడు వెంకన్న అని పేర్కొంటూ,న్యాయవాదిగా న్యాయం కోసం, రాజకీయ నాయకుడిగా ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.ఆనాటి కఠిన రాజకీయ పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని ప్రజల  కోసంనిలబడ్డ ధైర్యవంతుడైన నాయకుడు బొమ్మ వెంకన్న అని ప్రశంసించారు. అలాంటి నాయకుడిని మర్చిపోవడం అంటే ప్రజల చరిత్రను మర్చిపోయినట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.వెంకన్న ఆశయాలను కొనసాగించడం, ప్రజల కోసం నిరంతరం పోరాడటం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని నేతలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇందుర్తి గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్లు పుల్లూరి రాజు, వంగర మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొడిగ పరుశరాములు, ఎండి కుతుబుద్దీన్, పూదరి వేణు, అందే సురేష్, చిట్టంపల్లి మల్లేశం, గట్టు ప్రశాంత్, అందే పరుశరాములు, బాబుమియా లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.