📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల పారిశుద్ధ్యం పై పర్యవేక్షణ లోపం

పోరుమామిళ్ల పారిశుద్ధ్యం పై పర్యవేక్షణ లోపం

📰 Generate e-Paper Clip

పారిశుద్ధ్యం పై పర్యవేక్షణ లోపం

పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం సచివాలయం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు చెడు వ్యర్ధాలు, చదరానికి నిలయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం అమలు చేసి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని సంకల్పంతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్డుపై కుప్పలు తిప్పలుగా చెత్త ఉన్నా పారిశుద్ధ కార్మికులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్డుపై ప్రయాణించే వ్యక్తులు ముక్కు మూసుకొని వెళ్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.ఈ చెత్త వలన దోమలు విపరీతంగా పెరిగి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.