📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాలి కుర్చీలతో దర్శనమిస్తున్న వంగూరు మండలoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

కాలి కుర్చీలతో దర్శనమిస్తున్న వంగూరు మండలoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

📰 Generate e-Paper Clip

*కాలి కుర్చీలతో దర్శనమిస్తున్న వంగూరు మండలoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…*

*నెలలో ఒకరోజు రెండు రోజులు దర్శనమిస్తున్న జూనియర్ అసిస్టెంట్*

*నాగర్ కర్నూల్ జిల్లా… వంగూరు మండలం: (సెప్టెంబర్ :30 ,ప్రజావాణి)*

వంగూరు మండలం కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉన్న సిబ్బంది వచ్చాము పోయాము అనే విధంగా వ్యవహరిస్తూ తమ ఇష్టానుసారంగా విధులను నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలి మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కూడా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వ్యాధులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే విధులు నిర్వహించవలసిన డాక్టర్లు నర్సులు తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు ఉదయం వచ్చాము మళ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు వెళ్ళిపోయాము మాకు నెల నెల జీతం వచ్చిందా అనే విధంగా వ్యవహరిస్తూ పేద ప్రజల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి అధికారుల పట్ల పై అధికారులు తీవ్ర చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ నేలలో రెండు రోజులు లేదా మూడు రోజులు వస్తూ ఉంటారు జీతాలు చేసి మళ్లీ నెలకు వస్తారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న వంగూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై చర్యలు తీసుకొని మండల ప్రజలకు ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించేందుకు పై అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.