📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

1857 సిపాయిల తిరుగుబాటు రికార్డులు పదిలం.. కానీ 2006 2007 రికార్డులు మాయం

 

నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగిలిన చింతకాని మండల పరిషత్ కార్యాలయం..?

 

సాఫ్ట్వేర్లు మారే అంటూ సాకులు చెప్తున్నా ఉపాధి హామీ ఎపిఓ

 

 

లిఖితపూర్వకంగా దరఖాస్తుదారుడు కి అందజేసిన నేపథ్యం

 

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న దరఖాస్తుదారుడు

 

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రత్యేక కథనం..!

 

1857 నాటి రికార్డులు పదిలం. నిజాం నవాబులు.. తెలంగాణ సాయుధ పోరాటం.. 1967 ప్రత్యేక తెలంగాణ రికార్డులు అంతకంటే పదిలం… అంతకంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపార నిమిత్తం.. వలస వచ్చి స్థిరపడి భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన నేపథ్యం. కానీ 2005 సంవత్సరంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని వ్యవసాయ కూలీలకు వంద రోజులు పని కల్పించి తట్టల్లో శ్రమ చేస్తే కడుపులో మెతుకులు పడాలని.. దేశవ్యాప్తంగా ఆకలి మంటలు ఉండొద్దని అనాటి యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ వందరోజుల పథకానికి నిండు లోకసభలో చట్టం చేశారు ఆ ఆమెరకు జాతీయ ఉపాధి హామీ పథకం భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న నేపథ్యం. ఇటీవల మహాత్మా గాంధీ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిన సంగతి తెలిసిందే.

 

కాగా 2005 సంవత్సరంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2006 సంవత్సరంలో పందిళ్ళపల్లి రెవెన్యూ పరిధిలోని 157/2 సర్వే నెంబర్లలో జంగిల్ క్లియరెన్స్ కింద సుమారు 29 మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేసినట్లు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా స్పందించిన మండల ఎంపీడీవో.. ఏ పీ ఓ జాతీ య ఉపాధి హామీ రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవని మూడుసార్లు సాఫ్ట్వేర్లు మారాయని. అంతకుముందు జాబ్ కార్డులలో మాస్టర్లు.. రికార్డులు కాగితాల మీద ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఆనాడు కూలీలకు చేసిన పనులకు నగదు చెల్లింపులు ఆ తర్వాత ప్రధానమంత్రి వాజ్ పాయ్ పాలన కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలు కరువు కాటకాలతో ఉమ్మడి రాష్ట్రం అల్లాడిన నేపథ్యంలో కరువు పని పథకం కింద కాలువలు మట్టి పనులు చేసిన సంగతి ప్రభుత్వ రికార్డులలో పదిలం. ఆనాడు లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చులు చేసిన సంగతి తెలిసిందే కానీ చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ సామాజిక కార్యకర్త అడిగిన సమాచారం దొరకలేదంటూ సాఫ్ట్వేర్లు మారే అంటూ డొంక తిరుగుడు సమాధానంతో.. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వటం ఆ శాఖ అధికారుల పనితీరును స్పష్టం చేస్తుంది. ఇప్పటికైనా విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల పరిషత్.. ఉపాధి హామీ ఏపీ ఓ చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆనాడు జాబ్ కార్డు మంజూరు చేసే సమయంలో ఆధార్ కార్డ్ ఎలక్షన్ గుర్తింపు కార్డు రేషన్ కార్డ్ ఇంటి నెంబర్లు తీసుకొని ఉపాధి హామీ కార్డు మంజూరు చేసినట్లు సాక్షాత్తు జిల్లా అధికారులు అంగీకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.