EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కరుగట్టిన రేషన్ మాఫియా డాన్ కాజా సత్యనారాయణపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్ )...

కరుగట్టిన రేషన్ మాఫియా డాన్ కాజా సత్యనారాయణపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్ ) అమలు.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 09) ఎన్.టి.ఆర్.జిల్లా వీరులపాడు కంచికచర్ల గ్రామాలలో నిర్వహిస్తుంటాడు. ఇతను  రేషన్ బియ్యాన్ని అక్రమ మళ్లింపు, రవాణా స్మగ్లింగ్ వంటి నేరాలకు పదే పదే పాల్పడుతున్న, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యాలకు దిగుతు బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల భద్రతకు భంగం కలిగించడానికి కారణం అవుతున్న ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్, వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ (50 సం.) అను అతని వలన ప్రజల ఆర్ధిక మరియు ఆహార భద్రత కు ముప్పు వాటిల్లుతున్నందున ప్రజా శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నందున అతనిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్(పీడీయాక్ట్)అమలుచేసేందుకుగానుఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ జిల్లా కలెక్టర్ కి పంపడం జరిగింది. జిల్లా కలెక్టర్ మార్చి 7వ తేదీన కాజా సత్యనారాయణ (50 సం.) పై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్ ) అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్, వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ (50 సం.) ఇతను నందిగామా మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్దనుండి మరియు కొంతమంది డీలర్స్ వద్ద నుండి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడు.ఇతను ఎక్కువగా వీరులపాడు కంచికచర్ల గ్రామాలలో నిర్వహిస్తుంటాడు. ఇతను ఈ గ్రామాలలో కొంతమందిని ఏజెంట్స్ గా ఏర్పాటు చేసుకోవడం షాప్ ల వారితో సంబందాలు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమ వ్యవహారాలను నిర్వహిస్తుంటాడు.కాజా సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011 లో పట్టుబడినాడు. ఇతనిపై 2011 నుండి 2018 వరకు 8 కేసులు, 2019 లో 2 కేసులు , 2020 లో 11 కేసులు, 2021 లో 6 కేసులు, 2022 లో 6 కేసులు, 2023 లో 2 కేసులు, 2024 లో 4 కేసులు, 2025 లో 2 కేసులు మరియు 2026 లోని మూడు నెలల కాలంలో 2 కేసులు ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నవి. ఇతనిపైఎన్.టి.ఆర్.జిల్లా తో పాటు ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు కలవు ఇతనిపై నందిగామ సబ్ డివిజన్ పరిదిలో రౌడీషీట్ కలదు.ఇతనిపై మార్చి 1వ తేదీన తాసిల్ధార్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు కంచిక చర్ల, జూజ్జూరు రోడ్డు వద్ద ఒక వాహనాన్ని అదుపులోనికి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో కాజా సత్యనారాయణ అతని అనుచరులతో వాహనాన్ని అడ్డగించి ప్రభుత్వ అధికారులపై ద్వౌర్జన్యం చేస్తూ తన వాహనాన్ని మరియు వాహనంలోని రేషన్ బియ్యాన్ని తీసుకుని అక్కడ నుండి వేగంగా పారిపోయినాడుదీనిపై వీరులపాడు పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతుంది.అదేవిధంగా మార్చి 2 తేదీన డిప్యూటీ తాసిల్ధార్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్ ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని ఎనిమిది వాహనాలను స్వాదీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతుంది. కాజా సత్యనారాయణ వలన పి.డి.ఎస్.రైస్ పంపిణీకి విఘాతం కలగాటమే కాకుండా రేషన్ బియ్యం లబ్ధిదారులను పలు ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడవటమే కాకుండా రేషన్ లబ్దిదారులకు నష్టం చేకూరుస్తున్నాడు.ఇతనిమీద గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇతని స్థావరాలను వ్యాపార ఏజెంట్లపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న ఈ ఆర్ధిక నేరగాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా పక్కా ఆధారాలతో పి.డి.యాక్ట్ క్రింద నమోదు చేయించి అరెస్టు చేయడం జరిగింది. ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్, ఇటువంటి ఆర్ధిక నేరగాళ్ల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా సి.సి.కెమెరాలు డ్రోన్ ల ద్వారా మారు మూల ప్రదేశాల లో కూడా వీరి ఆగడాలను నియంత్రించి ప్రభుత్వ ప్రజా పంపిణీ ఫలాలను ప్రజలకు చేరుటకు గట్టి కృషి చేయడం జరుగుతుంది.ఈ ఆర్ధిక నేరగాడైన కాజా సత్యనారాయణ (50 సం.) ను అదుపులోనికి తీసుకుని పి.డి. యాక్ట్ అమలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.నగర ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ రవాణా లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112, 7328909090 నెంబరుకు సమాచారం ఇవ్వాలని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో సహకారం అంధించాలని, ప్రజల భద్రత కోసం నగరంలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని నేరాలకు పాల్పడే వ్యక్తులపై అవసరమైతే పి.డి. యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేయడంలో ఎటువంటి సందేహం ఉండదని నగర పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.