📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapet*కత్రం చారిటబుల్ వైద్య సేవలు ప్రశంసనీయం*

*కత్రం చారిటబుల్ వైద్య సేవలు ప్రశంసనీయం*

📰 Generate e-Paper Clip

*చిలుకూరు మార్చి 06(ప్రజావాణి)*: చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో “కత్రం ఆరోగ్యసేవ” ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. బేతవోలు సర్పంచ్ నాగయ్య ఈ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో అన్ని దానాల్లోకి ఆరోగ్యదానమే మిన్న అన్నారు. సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నా అందరిలోనూ సేవా గుణం ఉండదని, కానీ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నతంగా ఎదిగినా మూలాలను మరువకుండా తన చుట్టూ ఉన్న వారికి సేవ చేయడం ప్రశంసనియమన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజారోగ్యం కోసం కత్రం శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఆరోగ్యసేవలు అభినందనీయమన్నారు. ఆయన సేవలను మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ వైద్యశిబిరంలో మొత్తం 231మంది వైద్య సేవలు పొందారు శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించి, శిబిరానికి వచ్చినవారికి నిర్వాహకులు పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ధో సర్జన్ డాక్టర్ పుట్టా వెంకటేష్,డాక్టర్ కావ్యశ్రీ, బేతవోలు ఉప సర్పంచ్ ఏడుకొండలు, కత్రం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు రామాంజనేయులు, కత్రం ఆరోగ్య సేవ కో-ఆర్డినేటర్ గౌతం రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Skip to PDF content

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.