📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఏ.పి జేఏసీ బద్వేలు తాలూకా నూతన కమిటీ.

ఏ.పి జేఏసీ బద్వేలు తాలూకా నూతన కమిటీ.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి :బద్వేలు తాలూకా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.శుక్రవారం సాయంత్రం బద్వేలులోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ సమావేశంలో తాలూకా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఏపీ జెఎసి బద్వేలు తాలూకా చైర్మన్ గా టి.నరసింహారెడ్డి (ఏపీ ఎన్జీవో), కన్వీనర్ గా మాదన విజయకుమార్ (యుటిఎఫ్), ట్రెజరర్ గా వి.శివరామిరెడ్డి (ఏపీ ఎన్జీవో), కో-చైర్మన్లు గా పి.వి.కృష్ణారెడ్డి (ఎస్టీయూ), ఎ.పి.సంజీవరెడ్డి (పి.ఆర్.టి.యు), ఎస్.వెంకటేశ్వర్లు (మెడికల్ అండ్ హెల్త్), కె.బ్రహ్మయ్య (పెన్షనర్స్ అసోసియేషన్), కో-కన్వీనర్లుగా బి.వెంగయ్య (మెడికల్ అండ్ హెల్త్), ఎస్.జనార్ధన్(ఏపీఎస్ ఆర్టీసీ), వి.వెంకటేశ్వర్లు(రెవిన్యూ), టి.ఎన్.వి.ఆర్.క్రిష్ణ శర్మ (పంచాయతీరాజ్) ఆర్గనైజింగ్ సెక్రెటరీగా సి.బ్రహ్మానంద రెడ్డి (సచివాలయ ఉద్యోగులు) సి.కౌసర్ జహాన్ (సచివాలయం) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ టి.నరసింహారెడ్డి, కన్వీనర్ మాదన విజయ కుమార్ లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు ఘోరంగా విఫలమవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పిఆర్సీ కాల వ్యవధి ముగిసి మూడేళ్లవుతున్నా నూతన పిఆర్సీని ఏర్పాటు చేయకుండా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలలో కేవలం 9000 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇంకా చెల్లించాల్సిన 35 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చే కరువు భత్యాన్ని సైతం సకాలంలో విడుదల చేయడం లేదని ఆరోపించారు. మూడు విడతల కరువు భత్యాన్ని సైతం పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం సైతం కొనసాగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పెద్దలు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని తక్షణమే 12వ పిఆర్సీని ఏర్పాటు చేయాలని, పిఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సన్నద్ధమవుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.