📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దోమలు బాబోయ్ దోమలు నివారణ చర్యలు ఎక్కడ సి.పి.ఐ

దోమలు బాబోయ్ దోమలు నివారణ చర్యలు ఎక్కడ సి.పి.ఐ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి: పోరుమామిళ్ల  విపరీతమైన దోమల వలన అంటువ్యాధులతో అల్లాడుతున్న ప్రజలు సిపిఐ ఆగ్రహంపట్టణంలో రంగసముద్రం,పోరుమామిళ్ల పంచాయతీల తో పాటు మండలంలో ఏ గ్రామంలోనైనా విపరీతమైన దోమల ఎక్కువై వాటి వలన, రకరకాల అంటువ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పంచాయతీ అధికారులపై ఆగ్రహం చెందారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలో, పట్టణంలో రోడ్డుపైన ఐదు గంటలు దాటితే ఒక్క నిమిషం ప్రజలు నిలబడిన,దోమలతో సంగీతం,పందులతో సహజీవనం అన్న రీతిలో దోమలు ఎక్కువయ్యాయి వాటి వలన ప్రతి ఇంటిలో జ్వరము, దగ్గు,జలుబు, వైరల్ ఫీవర్, రక్త కణాలు తగ్గడం, పరుగు, పరుగుమని దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి పట్టణంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దానికి అదునుగా ప్రైవేట్ హాస్పటల్లో టెస్టుల పేరుతో పేషెంట్ ను నిలువు దోపిడీ చేసి, మూడు నాలుగు రోజులు తిప్పుకుంటే గాని జ్వరాలు తగ్గలేని పరిస్థితి, ఈ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మండల అభివృద్ధి అధికారి, ఏవో రమణయ్యకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో విన్నత పత్రం అందించడం జరిగింది. ఈ సమస్యలపై పంచాయతీ అధికారులు ఎందుకు నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు అర్థం కాని పరిస్థితి. అధికారులు ఉండడం బాధాకరం అలాగే గ్రామాల్లో మా పెద్దలు బర్రె లకు జోరీగలు పట్టాయి పొగ పెట్టండి అని చెప్పేవాళ్ళు ఆ విధంగా ప్రజలపై ఐదు నిమిషాలు కూడా సాయంత్రం సమయంలో రోడ్డుపైన ఎక్కడ కూడా నిలబడలేని పరిస్థితి అందువలన వెంటనే ప్రజల కోసం పనిచేసే పంచాయతీ అధికారులు ఇంటి పన్నులు రాబట్టుకునే శ్రద్ధ ప్రజల అవసరాలు తీర్చడంలో నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో దోమలపై చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకంగా పోరుమామిళ్ల పట్టణంలో ప్రతి వీధిలో రెండు పంచాయతీ అధికారులు వెంటనే దోమలపై, పాగింగ్, స్ప్రేయింగ్, చేయాలని వారు కోరారు లేనిపక్షంలో వీధులలో పన్నులు ఏ విధంగా రాబడతారని వారు అధికారులపై ఆగ్రహం చెందారుఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ, సఫా, వెంగయ్య, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.