📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆశా వర్కర్ జాబితా లో అవకతవకలు

ఆశా వర్కర్ జాబితా లో అవకతవకలు

📰 Generate e-Paper Clip

కడప జిల్లా  ప్రజావాణిన్యూస్ (మర్చి26)పోరుమామిళ్ల   మండలం తోకలపల్లె పంచాయతీ  నా పేరు ఇండ్ల కవిత నేను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మహిళను మా గ్రామము తోకలపల్లె తిమ్మారెడ్డి పల్లె పంచాయతీ పోరుమామిళ్ల మండలం మా పంచాయతీలోని ఆశా వర్కర్ నియామకం గురించి నేను ఫిర్యాదు చేసి ఉన్నాను మా పంచాయతీలో నియమించిన ఆశ వర్కర్ యొక్క రేషన్ కార్డు నెల్లూరు జిల్లాకు సంబంధించినది. ఒక రెసిడెన్సి సర్టిఫికెట్ పొందాలి అంటే ఎమ్మార్వో ఆఫీస్ లో ఆధార్ కార్డు రేషన్ కార్డ్ రెండు సరిగ్గా ఉంటేనే మంజూరు చేస్తారు లేదంటే వెనక్కి పంపుతారు ఈ మహిళను ఏ విధంగా లోకల్ గా పరిగణించారు నాకు అర్థం కావడం లేదు మా పంచాయతీలో ఇంతకుముందు ఎస్సీ మహిళ ఆశ వర్కర్ గా పని చేసింది ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మహిళను నియమించకుండా ఓసి సామాజిక వర్గానికి చెందిన మహిళను నియమించారు ఒక ఆశా వర్కర్ను నియమించాలి అంటే వెయ్యి మంది జనాభా కలిగి ఉండాలి తోకలపల్లి గ్రామంలో సుమారుగా 900 మంది జనాభా ఉన్నారు .అటువంటిది మా గ్రామంలో నివాసముండే మహిళను కాకుండా 4 50 మంది జనాభా గల తిమ్మారెడ్డి పల్లె గ్రామం మహిళను నియమించారు నేను ఎస్సీ మాల మహిళను కాబట్టి రాజకీయంగా పలుకుబడి లేక ఆర్థిక స్తోమత లేకపోవడంతో అధికారులు డబ్బులు కాశపడి రాజకీయ పలుకుబడితో ఓసి మహిళను ఆశ వర్కర్ గా నియమించారు ఈ విషయమై కడప జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది .నా మీద దయవుంచి నేను చేసిన ఫిర్యాదును మీరు విచారించి నాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.