📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో రహదారుల సమీక్ష

ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో రహదారుల సమీక్ష

📰 Generate e-Paper Clip

ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో రహదారుల సమీక్ష

జిల్లా కలెక్టర్ రాజబాబు

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి.
రోడ్డు భవనాల శాఖ ఎస్ ఈ. రవి నాయక్.

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26.

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కుంట – రామాయపట్నం రహదారి నిర్మాణంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీ.కోన శశిధర్ శనివారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఇందులో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల
ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం వచ్చే సోమవారం సమావేశం నిర్వహించనున్నది. ఈ దృష్ట్యా జిల్లాలకు అవసరమైన కీలక రహదారుల ప్రతిపాదనలు, అమలు చేస్తున్న వినూత్న ఆలోచనలపై శశిధర్ ఆరా తీశారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలోని కుంట నుంచి ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియా, చీమకుర్తి గ్రానైట్ ప్రాంతం మీదగా రామాయపట్నం వరకు రహదారి అవసరం ఉందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇప్పటికే కుంట నుంచి ఉన్న 765 జాతీయ రహదారితో కలవడం ద్వారా హైదరాబాదుకు అనుసంధానం మరింత పెరుగుతుందన్నారు. ఫలితంగా వాణిజ్య కార్యకలాపాలు పెరిగి జిల్లా ఆర్థిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుందన్నారు. కీలకమైన ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామని, త్వరగా
అందుబాటులోకి వచ్చేలా చూడాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ తీరును కూడా ఆయన వివరించారు.
ఈ సమావేశంలో డిటిసి సుశీల, రోడ్డు-భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్, సీపీఓ సుధాకర్ రెడ్డి, భూసేకరణ విభాగ సూపరింటెండెంట్ నాగలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.